ETV Bharat / bharat

టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'

కరోనా.. మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. కానీ.. 110 ఏళ్ల క్రితం ఇదే పేరుతో వచ్చిన ఓ యంత్రం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఎప్పుడైనా విన్నారా? చూడముచ్చటైన, తేలికపాటి కరోనా టైప్​రైటర్​ను కొనేందుకు అనేక మంది ఆసక్తి చూపేవారని తెలుసా? కరోనాతోపాటు మరికొన్ని ఫేమస్ టైప్​రైటర్ల కథలు తెలియాలంటే.. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని మ్యూజియంకు వెళ్లాల్సిందే.

indore typewriter museum
టైప్ రైటర్ల మ్యూజియం
author img

By

Published : Sep 18, 2022, 12:49 PM IST

టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'

కుటుంబానికి ఉపాధి మార్గమైన టైప్​రైటర్​ పట్ల ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నారు మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన ఓ వ్యక్తి. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 450 టైప్​రైటర్లు సేకరించి.. ఓ మ్యూజియం స్థాపించారు రాజేశ్ శర్మ. భారత్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనాలో తయారైన టైపింగ్ యంత్రాల్ని ఈ ప్రదర్శనశాలలో చూడొచ్చు.

"టైప్​రైటింగ్​.. మా తండ్రి వృత్తి. జిల్లా కోర్టు దగ్గర మా దుకాణం ఉండేది. ఇప్పటికీ ఉంది. అక్కడ న్యాయవాదుల కోసం మా తండ్రి టైప్​రైటింగ్ చేసేవారు. చిన్నప్పుడు మేము వెళ్లి అక్కడ కూర్చునేవాళ్లం. టైప్​రైటర్లతో, వాటి శబ్దాలతో మాకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. తర్వాత నేను వేరే వృత్తిలోకి వెళ్లాను. అయితే.. టైప్​రైటింగ్ యంత్రాలు కనుమరుగు అయిపోతున్నాయని 7-8ఏళ్ల క్రితం అనిపించింది. అందుకే సేకరణ మొదలుపెట్టా. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మొబైల్, కంప్యూటర్​ వరకు వచ్చామని యువతరం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. టైప్​రైటర్​.. మొబైల్​కు తండ్రి. ఇప్పుడు మొబైల్​లో ఉన్న క్వర్టీ కీబోర్డ్ ఈ టైప్​రైటర్స్​ అన్నింటిలోనూ ఉంది."

-రాజేశ్ శర్మ, టైప్​రైటర్ల మ్యూజియం వ్యవస్థాపకుడు

indore typewriter museum
మ్యూజియంలోని టైప్​రైటర్లు
indore typewriter museum
టైపింగ్ చేస్తున్న రాజేశ్​ శర్మ

1890లో తయారైన అమెరికన్ ఇంగ్లిష్ టైప్​రైటర్​.. రాజేశ్​ శర్మ మ్యూజియంలో ఉంది. మిగిలిన వాటిలో చాలావరకు 1910-1930 మధ్య తయారైనవే. 1922లో మెర్సిడెజ్ సంస్థ, రాయల్​ కంపెనీ ఉత్పత్తి చేసిన టైప్​రైటర్ల​నూ ఇక్కడ చూడొచ్చు. గోద్రెజ్​, రెమింగ్​టన్​ టైపింగ్ యంత్రాలూ రాజేశ్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రపంచంలో తొలి టైప్​రైటర్​ను తయారు చేసిన సంస్థగా రెమింగ్​టన్​ గుర్తింపు పొందింది. 1960-2000 మధ్య ట్రాంప్​ కంపెనీ విడుదల చేసిన టైపింగ్ యంత్రాలూ.. ఇక్కడ ఉన్నాయి.

indore typewriter museum
మ్యూజియంలోని టైప్​రైటర్లు
indore typewriter museum
పురాతన టైప్​రైటర్

రాజేశ్ శర్మ ఏర్పాటు చేసిన మ్యూజియంలో కరోనా టైప్​రైటర్​ ప్రత్యేకమైనది. 1913లో కరోనా కంపెనీ దీనిని తయారు చేసింది. అప్పట్లో ఈ సంస్థ చాలా ఫేమస్. రెండున్నర కిలోల బరువుతో, చిన్నగా, మడత పెట్టి తీసుకెళ్లగలిగేలా ఉండే కరోనా టైప్​రైటర్​ను పోలీసు అధికారులు ఎంతగానే ఇష్టపడేవారని చెప్పారు రాజేశ్.

indore typewriter museum
మ్యూజియం వ్యవస్థాపకుడు రాజేశ్ శర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.