భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 41,965 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 33,964 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,28,10,845
- మొత్తం మరణాలు: 4,39,020
- మొత్తం కోలుకున్నవారు: 3,19,93,644
- యాక్టివ్ కేసులు: 3,78,181
వ్యాక్సినేషన్..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Vaccination in India) కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 1,33,18,718 కొవిడ్ టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 65,41,13,508 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొవిడ్ పరీక్షలు
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 16,06,785 కొవిడ్ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,07,337 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 8,925 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,85,11,764కు చేరగా.. మరణాల సంఖ్య 45,32,509కి పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా -156,002
- బ్రెజల్- 25,586
- రష్యా- 17,813
- బ్రిటన్- 32,181
- ఫ్రాన్స్- 19,425
ఇదీ చూడండి: Thirdwave of Corona: అక్టోబరు-నవంబరు మధ్య మూడోదశ ఉద్ధృతి!