దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 11,271 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India) ధాటికి మరో 285 మంది బలయ్యారు. మరణాల రేటు 1.35 కాగా.. రికవరీ రేటు 98.26గా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,44,37,307
- మొత్తం మరణాలు: 4,63,530
- యాక్టివ్ కేసులు: 1,35,918
- కోలుకున్నవారు: 3,38,37,859
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 57,43,840 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,12,01,03,225కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,28,424 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 5,997 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,36,72,011కు చేరింది. మొత్తం మరణాలు 51,10,260 కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 41,107 మందికి వైరస్ సోకింది. మరో 506 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 39,256 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 38,351 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 157 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 22,583 కరోనా కేసులు నమోదవగా.. 215 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 35,276 మందికి కొవిడ్ సోకింది. 109 మంది మరణించారు.
ఇదీ చదవండి:ఆరోగ్య బీమాకు సుంకాల సంకెళ్లు