Covid 19 India: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 2,827 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 24 మంది చనిపోయారు. ఒక్కరోజే 3,230 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్ కేసులు 19 వేల 100 దిగువకు చేరాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.60 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.72 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,13,437
- మొత్తం మరణాలు: 5,24,181
- యాక్టివ్ కేసులు: 19,067
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,70,165
Vaccination India: దేశవ్యాప్తంగా బుధవారం 14,85,292 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,83,96,788కి చేరింది. ఒక్కరోజే 4,71,276 కరోనా టెస్టులు నిర్వహించారు.
Global Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 5,75,895 కేసులు వెలుగుచూశాయి. మరో 1,534 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 51,90,10,979కు చేరింది. మరణాల సంఖ్య 62,82,141 వేలకు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,38,03,665గా ఉంది.
- జర్మనీలో రికార్డుస్థాయిలో ఒక్కరోజే 93,102 కేసులు, 227 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో దాదాపు 87,487 కేసులు వెలుగుచూశాయి. మరో 226 మంది కొవిడ్ వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీ, ఫ్రాన్స్‌లో 40 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 115, 96 చొప్పున మరణించారు.
- దక్షిణ కొరియాలో 43,899 కేసులు, జపాన్‌లో 39 వేలు, బ్రెజిల్లో 23 వేల చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి
ఇదీ చదవండి: టమాటా ఫ్లూ కలకలం.. ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు!