దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 13,091 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా కారణంగా (Coronavirus India) మరో 340 మంది బలయ్యారు.
- మొత్తం మరణాలు: 4,62,189
- యాక్టివ్ కేసులు: 1,38,556
- కోలుకున్నవారు: 3,38,00,925
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,36,256 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 7,874 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,21,03,318 కు చేరింది. మొత్తం మరణాలు 50,87,705కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 94,376 మందికి వైరస్ సోకింది. మరో 1,493 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 38,058 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,239 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 39,329 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 214 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 27,259 కరోనా కేసులు నమోదవగా.. 203 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 45,416 మందికి కొవిడ్ సోకింది. 244 మంది మరణించారు.
ఇదీ చదవండి:Corona cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా