Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 315 మంది మరణించారు. 1,09,345 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 36,582,129
- మొత్తం మరణాలు: 4,85,350
- యాక్టివ్ కేసులు: 12,72,073
- మొత్తం కోలుకున్నవారు: 3,48,24,706
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,86,254 మందికి కరోనా సోకింది. 7,606 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,08,96,639కి చేరగా.. మరణాలు 55,39,078కు పెరిగింది.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,06,493 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1,969 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 65,236,475 దాటింది.
- ఫ్రాన్స్‌లో బుధవారం ఒక్కరోజే 3,05,322 కేసులు వెలుగుచూశాయి. మరో 225 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 1,09,133 మంది వైరస్ బారిన పడ్డారు. 335 మంది మృతి చెందారు.
- ఇటలీలో 1,84,615 కొత్త కేసులు బయటపడగా.. 316 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,59,161 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:
చైనా క్రూరత్వం.. ఇనుప పెట్టెల్లో కొవిడ్ బాధితులు.. ముగ్గురికి జైలు