India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. శుక్రవారం 4,216 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.41 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉంది. సుమారు 103 రోజుల తర్వాత దేశంలో 8వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
- మొత్తం కరోనా కేసులు: 43,206,195
- మొత్తం మరణాలు: 5,24,757
- యాక్టివ్ కేసులు: 40,370
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,48,308
Vaccination India: భారత్‌లో శుక్రవారం 15,08,406 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,92,71,111 చేరింది. మరో 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 529,850 కేసులు వెలుగుచూశాయి. మరో 1,273 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 539,714,066కు చేరింది. మరణాల సంఖ్య 6,329,704కు చేరింది. ఒక్కరోజే 455,312 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 512,293,947గా ఉంది.
- అమెరికాలో 93,870 కొత్త కేసులు, 205 మరణాలు వెలుగుచూశాయి.
- జర్మనీలో 74,908 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో 106 మంది ప్రాణాలు కోల్పయారు.
- తైవాన్‌లో 68,347 కొవిడ్ కేసులు, 213 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 56,491 మంది వైరస్ బారిన పడ్డారు. 158 మంది చనిపోయారు.
- ఉత్తర కొరియాలో45,540 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం