ETV Bharat / bharat

'సైన్యానికి కొత్త శక్తి'.. సీ295 విమానాల తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన - సీ 295 ఎయిర్​క్రాఫ్ట్ న్యూస్

గుజరాత్ వడోదరలో నిర్మించనున్న సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని.. ఈ ప్లాంటులో తయారు చేసే రవాణా విమానాలు మన సైన్యానికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు.

c 295 aircraft manufacturing
c 295 aircraft manufacturing
author img

By

Published : Oct 30, 2022, 5:47 PM IST

గుజరాత్ వడోదరలో నిర్మించనున్న సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో శిలాఫలకాన్ని రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని.. ఈ ప్లాంటులో తయారు చేసే రవాణా విమానాలు.. మన సైన్యానికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. త్వరలో మేక్ ఇన్ ఇండియా ట్యాగ్​తో.. ప్రయాణికుల విమానాన్ని కూడా భారత్​ రూపొందిస్తుందని ఆకాంక్షించారు.

"ఇక్కడ తయారు చేసే రవాణా విమానాలు మన సైన్యానికి శక్తిని ఇవ్వడమే కాకుండా విమానాల తయారీలో కొత్త పంథాకు నాంది పలుకుతాయి. త్వరలో మేక్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌తో తయారయ్యే ప్రయాణికుల విమానానికి భారత్‌ సాక్ష్యంగా నిలవనుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. విమాన ట్రాఫిక్‌లో ప్రపంచంలోని టాప్‌-3 దేశాల జాబితాలోకి భారత్‌ ప్రవేశించబోతోంది. రాబోయే 10-15 ఏళ్లలో భారతదేశానికి కొత్తగా 2 వేల ప్రయాణికులు, కార్గో విమానాలు అవసరమవుతాయి. దీన్ని బట్టి చూస్తే భారత్‌ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అవగతమవుతోంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

సైన్యంలో రవాణా విమానాలుగా సేవలందిస్తున్న అవ్రో-748 స్థానంలో కొత్తగా తయారయ్యే అధునాతన సీ-295 విమానాలను భర్తీ చేయనున్నారు. గతేడాది సెప్టెంబర్​లోనే.. సీ-295 తయారీకి సంబంధించి ఎయిర్​బస్​ డిఫెన్స్ అండ్​ స్పేస్​ సంస్థతో వైమానిక దళం ఒప్పందం చేసుకుంది. 21వేల కోట్లతో 56 సీ-295 రవాణా విమానాలను సమకూర్చుకునేందుకు అంగీకారం కుదుర్చుకుంది. ఈ మేరకు 40 విమానాలను టాటా-ఎయిర్​బస్​ కన్సార్టియం వడోదరలో ఉత్పత్తి చేయనుంది.

ఇవీ చదవండి: 'అధ్యక్ష తరహా పాలన వైపు దేశం.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి'

'జర్నలిస్టులకు నగదు పంపలేదు.. ఇదంతా కాంగ్రెస్ టూల్​కిట్ ప్రచారమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.