ETV Bharat / bharat

పట్టపగలే బ్యాంకు దోపిడీ.. కస్టమర్లలా వచ్చి రూ.లక్షలు లూటీ

పంజాబ్​లోని సెంట్రల్ బ్యాంకులో సినీఫక్కీలో చోరీ చేశారు దొంగలు. పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి రూ.లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.

Punjab Bank Robbery
పట్టపగలే బ్యాంకు దోపిడీ.. కస్టమర్లలా వచ్చి నగదు లూటీ
author img

By

Published : May 6, 2022, 8:15 PM IST

Punjab Bank Robbery: పంజాబ్​​ అమృత్​సర్​లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి దూరి రూ.6 లక్షలు దోచుకెళ్లారు. అందరూ చూస్తుండగానే సినీ ఫక్కీలో చోరీ చేశారు. అనంతరం దర్జాగా తెల్ల కారులో పరారయ్యారు. నలుగురు యువకులు అమృతసర్​ సెంట్రల్​ బ్యాంకులోకి కస్టమర్లలా ప్రవేశించారని బ్యాంకు అధికారులు చెప్పారు. అనంతరం నగదు చోరీ చేసి కారులో పారిపోయారని వెల్లడించారు.

Amritsar bank looty: ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి వెంటనే దర్యాప్తు చేపట్టారు. స్వయంగా కమిషనర్​ కేసును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, అన్ని సీసీటీవీలను పరిశీలిస్తున్నాని ఆయన చెప్పారు. పంజాబ్​లో ఇటీవలి కాలంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకునే విషయంలో పోలీసుల విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.