ETV Bharat / bharat

రాష్ట్ర స్థాయిలో హిజ్రాల సత్తా.. ప్రభుత్వ టీచర్లుగా ముగ్గురు ట్రాన్స్​జెండర్స్

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ముగ్గురు ట్రాన్స్​జెండర్స్ ఎంపికయ్యారు. పదిమంది హిజ్రాలు పరీక్షలో పాల్గొనగా ముగ్గురు అర్హత సాధించారని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తెలిపారు.

In a first, three transgenders selected as govt school teachers in Karnataka
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ముగ్గురు ట్రాన్స్​జెండర్స్ ఎంపిక
author img

By

Published : Nov 20, 2022, 10:20 AM IST

హిజ్రాలు అందంగా మేకప్ వేసుకుని.. చప్పట్లు కొట్టి.. రోజుకు ఎంతో కొంత సంపాదించుకుంటారనే అందరూ అనుకుంటారు. అయితే సమాజంలో వివక్షతను దాటుకుంటూ ట్రాన్స్​జెండర్స్ కూడా ఇప్పుడు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. అన్ని ఒడుదొడుకులను ఎదుర్కొంటూ తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే, కర్ణాటక చరిత్రలో తొలిసారిగా ముగ్గురు ట్రాన్స్​జెండర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం- పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కింద శుక్రవారం తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 13,363 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ (జీపీఎస్ఆర్) రిక్రూట్‌మెంట్ జాబితాలో ముగ్గురు ట్రాన్స్​జెండర్స్ మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.

"రిక్రూట్​మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎనిమిది నెలల్లో స్క్రీనింగ్ పరీక్ష పారదర్శకంగా నిర్వహించాం. పదిమంది ట్రాన్స్​జెండర్స్ ఈ టెస్ట్​లో పాల్గొనగా, ముగ్గురు అర్హత సాధించారు. అలాగే 34 మంది ఇంజనీరింగ్ అభ్యర్థుల్లో 19 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఫిబ్రవరిలో హైస్కూల్ టీచర్ల నియామకం చేపడతాం. పాఠశాలల విద్యా నాణ్యతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థి, ఉపాధ్యాయులకు అనుకూలమైన విద్యా రంగం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నవంబర్ 14న 7,601 పాఠశాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది" అని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.