ETV Bharat / bharat

'నేను డిక్టేటర్​గా మారతా.. వారి సంగతి చూస్తా'.. సీఎం స్ట్రాంగ్​ వార్నింగ్​!

ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు తమిళనాడు సీఎం స్టాలిన్​. మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. తాను ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించానని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేసుకున్నారు.

stalin
stalin
author img

By

Published : Jul 4, 2022, 1:38 PM IST

Tamilnadu CM Stalin: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు అక్రమాలకు లేదా క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడితే తాను నియంతగా మారి కఠిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హెచ్చరించారు. ఆదివారం జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను.. భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. చట్టానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు స్టాలిన్.

"రాష్ట్రంలో డీఎంకే పార్టీ అంత తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోలేదు. కోట్లాది మంది పార్టీ కార్యకర్తల నిస్వార్థ కృషి ఫలితంతోనే అధికారంలోకి వచ్చాం. నేను కూడా గత ఐదు దశాబ్దాలుగా చేసిన కృషితోనే ముఖ్యమంత్రి అయ్యాను. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించి, 1989లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. అది మీరు గుర్తుంచుకోండి. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి."

-- స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి

ప్రజల మన్ననలు పొందడం కష్టసాధ్యమని, గత 50 ఏళ్లుగా తాను ప్రజల మధ్యే పనిచేస్తున్నానని స్టాలిన్​ తెలిపారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేసినప్పుడే వారు అండగా నిలుస్తారని చెప్పారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే సామాన్య ప్రజలు బహిష్కరిస్తారనే విషయం మర్చిపోవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదని స్టాలిన్ అన్నారు.

ఇవీ చదవండి: 'అగ్నిపథ్'​పై వచ్చే వారం సుప్రీం విచారణ

'మహా' బలపరీక్షలో నెగ్గిన సీఎం శిందే.. మరోసారి సుప్రీంకు ఠాక్రే వర్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.