ETV Bharat / bharat

యూపీ కూలీల హత్య.. అరెస్టైన హైబ్రిడ్ ఉగ్రవాది హతం.. ఎలాగంటే? - hybrid terrorist killed

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది.. మరో ముష్కరుడి కాల్పులకు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

hybrid terrorist involved in labourers killing died in antiterror operation

author img

By

Published : Oct 19, 2022, 7:41 AM IST

Updated : Oct 19, 2022, 10:03 AM IST

Hybrid Terrorist Killed: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా 'హైబ్రిడ్ ఉగ్రవాది' ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. మరో ముష్కరుడి కోసం బుధవారం ఉదయం సోదాలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాది తమపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, అప్పుడు హైబ్రిడ్​ ఉగ్రవాది​ చనిపోయాడని చెప్పారు.

ఇదీ జరిగింది..
స్థానికేతరులే లక్ష్యంగా మంగళవారం.. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మనీశ్ కుమార్, రామ్ సాగర్​లుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్​ను అరెస్టు చేశారు. బుధవారం మరో ఉగ్రవాది చేతిలో బషీర్​ హతమయ్యాడు.

అసలు హైబ్రిడ్ ఉగ్రవాదులు అంటే ఎవరు? సాధారణ ఉగ్రవాదులకు వీరికి మధ్య తేడా ఏంటి? వీరిని గుర్తించడం ఎందుకు కష్టం వంటి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇవీ చదవండి: హైకోర్టు సీజేనంటూ డీజీపీకి ఫోన్.. తన ఫ్రెండ్​కు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ ఒత్తిడి

48 మందితో కాంగ్రెస్​ లిస్ట్ రిలీజ్​.. అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు!

Last Updated : Oct 19, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.