ETV Bharat / bharat

'నా భర్త లిప్​స్టిక్​ పెట్టుకుంటున్నాడు.. సెక్స్​ చేయట్లేదు'.. కోర్టు మెట్లెక్కిన మహిళ - మహిళ పిటిషన్​

తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్​స్టిక్​ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన ​ హైకోర్టు.. ప్రతి నెలా ఆమెకు రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని బాధితురాలి భర్తను ఆదేశించింది. అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది?

husbands-sleeps-separately-from-wife
husbands-sleeps-separately-from-wife
author img

By

Published : Jun 18, 2022, 1:24 PM IST

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​కు చెందిన ఓ మహిళ తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.30 వేలు పరిహారం కింద చెల్లించాలని బాధితురాలి భర్తను ఆదేశించింది.

అసలేం జరిగిందంటే? ఇందోర్​లోని మహాలక్ష్మినగర్​కు చెందిన 26 ఏళ్ల బాధితురాలు.. అదే ప్రాంతంలో ఉంటున్న దిలేశ్వర్​ను ​(32) ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే ఆమెను తన భర్తతోపాటు అత్త వేధించడం ప్రారంభించారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకుని దిలేశ్వర్.. పుణెలో కాపురం పెట్టాడు. కొద్దిరోజులకే బాధితురాలి అత్త అక్కడికి కూడా వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక, ఆమె ఎదురుతిరగడం వల్ల కన్నవారింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్​ వేసింది. అప్పుడు ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది.

ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు తన భర్త చేసే వింత చేష్టలను.. పిటిషన్​లో తెలియజేసింది. పెళ్లైన తర్వాత ఒక్కసారి కూడా తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని తెలిపింది. తాను ప్రయత్నించినా వేరే గదిలో పడుకునేవాడిని చెప్పింది. సాయంత్రం ఆడవారిలా మేకప్​ వేసుకునేవాడని, చెవిపోగులు ధరించేవాడని పేర్కొంది. అలాగే పెదవులకు లిప్​స్టిక్​ పూసుకునేవాడని.. అలా చెయ్యొదని వారించినా చేయి చేసుకునేవాడిని ఆరోపించింది. ఆమె పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ప్రతి నెలా రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి: 18 ఏళ్ల తర్వాత భార్యాపిల్లల చెంతకు.. ఇన్నిరోజులు పాపం ఒక్కడే!

అర్ధరాత్రి రాళ్లు రువ్వుతూ బాలుడి వీరంగం.. 36 కార్లు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.