ETV Bharat / bharat

శృంగారానికి నిరాకరించిందని భార్యను కడతేర్చిన భర్త.. ఫ్రెండ్స్ చేతిలో యువతి దారుణ హత్య - Sri Rama Sena President Ravikumar shotted

భార్య, కుమార్తెను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. గుజరాత్​లో ఘోరం జరిగింది. మరోవైపు శృంగారానికి నిరాకరించిందని భార్యను చంపేశాడు ఆమె భర్త. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది.

husband-murdered-wife-and-daughter-in-gujarat
గుజరాత్​లో భార్య కూతురిని చంపిన భర్
author img

By

Published : Jan 8, 2023, 10:18 AM IST

Updated : Jan 8, 2023, 10:23 AM IST

కట్టుకున్న భార్యను, కన్నకూతురిని కడతేర్చాడు ఓ వ్యక్తి. ఇద్దరిని బయటకు తీసుకెళ్లిన వారిని అంతమొందించాడు. గుజరాత్​లో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారిఫ్,​ అతడి భార్య షబానా(30)తో కలిసి మమ్లత్దార్ ఎల్‌సీబీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న రుబీనా అనే కుమార్తె ఉంది. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. దీంతో షబానా తన పుట్టింటికి వెళ్లింది. అనంతరం భర్త వద్దకు తిరిగి రావడానికి నిరాకరించింది. దీంతో భార్యతో మాట్లాడాలని జామ్​నగర్​కు రప్పించాడు తారిఫ్.

సుమ్సన్ ప్రాంతంలోని లాల్‌పూర్-తేబా చౌక్డీ బైపాస్ వద్దకు భార్య, కుమార్తెను తీసుకెళ్లాడు. అనంతరం భార్యను గొంతు కోసి చంపేశాడు. కూతురినీ హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలంలో మృతదేహాలను గమనించిన కొందరు స్థానికులు.. సమాచారాన్ని పోలీసులకు అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్యను చంపిన భర్త..
శృంగారానికి నిరాకరించిందని భార్యను కడతేర్చాడు ఓ వ్యక్తి. ఆమె గొంతు నులిమి చంపేసి అనంతరం మృతదేహాన్ని కాల్చేశాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మాయగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త సంజయ్ సఖ్రే(36)ని నిందితుడిగా తేల్చారు. యవత్మాల్ జిల్లాలోని పోఫాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

యువతిని హత్య చేసిన ఇద్దరు యువకులు..
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో ఘోరం జరిగింది. 22 ఏళ్ల యువతిని దారుణంగా చంపేశారు ఇద్దరు స్నేహితులు. కసరాఅటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. క్రూరంగా కత్తితో దాడి చేశారు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితులను రిజ్వాన్, అర్షద్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని ఆగ్రా హైవే సమీపంలోని వార్లిపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి యువతిని బైక్​పై తీసుకువెళ్లిన యువకులు.. అనంతరం ఆమెను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసకున్నట్లు పోలీసులు తెలిపారు.

కర్ణాటకలో కాల్పులు..
కర్ణాటక, బెళగావిలో శ్రీరామ సేన అధ్యక్షుడు రవికుమార్​పై కాల్పులు జరిగాయి. బైక్​పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడులకు తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రవికుమార్​ కారులో వెళ్తుండగా హిండలగ గ్రామ సమీపంలో దాడి జరిగింది. ఘటనలో రవికుమార్​తోపాటు అతడి డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలాన్ని బెళగావి రూరల్​ పోలీసులు సందర్శించారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని వారు వెల్లడించారు.

Last Updated : Jan 8, 2023, 10:23 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.