ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే! - పోటీ పరీక్షల ప్రిపరేషన్​

How To Prepare For Competitive Exams In Telugu : మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? సరైన ప్రణాళిక వేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? చదువుతున్నది గుర్తు ఉండడం లేదా? అయితే ఇది మీ కోసమే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, తమ లక్ష్య సాధన కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Preparation Strategy for Competitive Exams
How to prepare for competitive exams
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 11:25 AM IST

How To Prepare For Competitive Exams : మనలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఉంటుంది. అందు కోసం చాలా కష్టపడి చదువుతుంటారు కూడా. కానీ సరైన ప్రణాళిక లేకపోతే, మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మరికొందరు ఎంత చదివినా, వాటిని త్వరగా మరిచిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్నింటినీ ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ప్రణాళిక వేసుకోవాలి!
    పోటీ పరీక్షల సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక సరళమైన, సమర్థవంతమైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. చాలా మంది సిలబస్​లోని ఇంపార్టెంట్​ భాగాలను మాత్రమే చదువుతారు. ఇది సరైన విధానం కాదు. అన్ని విభాగాలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులను, సులువైన సబ్జెక్టులను పూర్తి చేయాలి. తరువాత కష్టమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఒకసారి మొత్తం సిలబస్​ పూర్తి చేసిన తరువాత, శాండ్​విచ్ మెథడ్ ఉపయోగించాలి. అంటే మీకు ఇష్టమైన సబ్జెక్టుల మధ్యలో కష్టమైన అంశాలను చేర్చి చదువుకోవాలి. అప్పుడే దీర్ఘకాలం పాటు ప్రిపరేషన్​ కొనసాగించడానికి వీలు అవుతుంది.
  2. చాలా పుస్తకాలు చదవద్దు!
    కొంత మంది విపరీతంగా మెటీరియల్​ను సేకరిస్తుంటారు. ఒకే సబ్జెక్టుకు సంబంధించిన వివిధ పుస్తకాలను కొంటుంటారు. ఇది సరైన విధానం కాదు. నిపుణుల సలహాతో ప్రమాణిక పుస్తకాల జాబితా రూపొందించుకోవాలి. వాటిని కనీసం రెండు, మూడు సార్లు అయినా చదవాలి. అప్పుడే మీకు ఎలాంటి కన్ఫూజన్ లేకుండా సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏదైనా అంశం కవర్ కాకపోతే, అప్పుడు మాత్రమే మరో ప్రామాణిక పుస్తకాన్ని సేకరించి, స్టడీ చేయాలి.
  3. ప్రాక్టీస్​ చేయాలి!
    మనం ఎంత తెలివైనవాళ్లం అయినప్పటికీ, ప్రాక్టీస్​ చేయడం మాత్రం ఆపకూడదు. చాలా మంది సబ్జెక్ట్​ను ఒకసారి చదివి వదిలేస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. మనం చదివిన సబ్జెక్ట్​లోని కీలమైన పాయింట్లను నోట్​ చేసుకోవాలి. ఈ నోట్స్​ను రెగ్యులర్​గా రివైజ్ చేస్తుండాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లాంటి అంశాలను నిత్యం ప్రాక్టీస్​ చేస్తుండాలి. ఇలా తరచూ అభ్యాసం చేస్తుంటేనే, మనం చదివినది గుర్తుంటుంది. సబ్జెక్ట్​పై మరింత అవగాహన పెరుగుతుంది.
  4. వేగంగా చదవాలి!
    మనలో చాలా మంది నెమ్మదిగా చదువుతుంటారు. చదివిన వాక్యాన్నే మరలా, మరలా చదువుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే స్పీడ్​ రీడింగ్ పద్ధతిని అలవరుచుకోవాలి. నిమిషానికి కనీసం 600-800 పదాలను చదవగలిగేలా ప్రాక్టీస్​ చేయాలి. మొదట్లో ఇది కష్టంగానే ఉంటుంది. కానీ అలవాటు పడితే చాలా బాగుంటుంది. కొంతమంది అందరికీ వినిపించేలా బయటకు చదువుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. పూర్తి ఏకాగ్రతతో మనస్సు పెట్టి చదవాలి. ఇలా నిరంతరంగా సాధన చేయాలి.
  5. పవర్ రీడింగ్
    చదివేటప్పుడు పుస్తకంలోని విషయాన్ని వేగంగా గ్రహించడానికి పవర్​ రీడింగ్ ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ చదివేటప్పుడు అనవసర విషయాలను, అప్రధానమైన అంశాలను పక్కన పెట్టి, అత్యంత కీలకమైన పాయింట్లను మనస్సులో నిక్షిప్తం చేసుకుంటూ పఠనాన్ని కొనసాగించడమే పవర్​ రీడింగ్​. సింపుల్​గా చెప్పాలంటే, చదివిన విలువైన సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకొనేలా తర్ఫీదు ఇచ్చేదే పవర్ రీడింగ్. తక్కువ సమయంలో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలంటే, ఈ పవర్​ రీడింగ్ పద్ధతిని ఉపయోగించడం చాలా మంచిది.
  6. విశ్లేషణ చేయాలి!
    కొన్ని అంశాలను కేవలం చదివితే సరిపోదు. వాటిని లోతుగా విశ్లేషించాలి. దీని వల్ల సదరు సబ్జెక్ట్​పై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇది పోటీ పరీక్షలోనే కాదు. ఇంటర్వ్యూల్లోనూ ఉపయోగపడుతుంది.
  7. మైండ్ మ్యాపింగ్
    పోటీ పరీక్షల ప్రిపరేషన్​లో కాస్త సృజనాత్మకత జోడించడం మంచిది. ముఖ్యమైన గుర్తులు, చిహ్నాలు, చిత్రాలు, ఫార్ములాలను, కీలకమైన అంశాలను 'మైండ్​ మ్యాపింగ్' విధానం ద్వారా గుర్తుంచుకోవచ్చు. కనుక ఇలాంటి మైండ్​ మ్యాపింగ్ టెక్నిక్స్ వాడడం మంచిది.
  8. మీకు అనువైన పద్ధతినే అనుసరించాలి!
    చాలా మంది విజేతల టైమ్​ టేబుల్​ను, ప్రణాళికలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది సరైనది కాదు. ఒకరి పద్ధతులు మరొకరికి సరిపడకపోవచ్చు. అందుకే మీకు సౌకర్యవంతంగా ఉండే ప్రణాళికను, టైమ్​ టేబుల్​ను వేసుకోవాలి.
  9. ఆటవిడుపు ఉండాలి!
    కొంత మంది ప్రిపేరేషన్ స్టార్ట్ చేసిన తరువాత, మిగతా అన్ని పనులను పక్కన పడేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మన మెదడుకు కాస్త విశ్రాంతి అవసరం. అందుకే ఉదయం, సాయంత్రం వేళ చిన్నపాటి వ్యాయామాలు, ఆటలు ఆడాలి. వారాంతాల్లో ఒక పూట స్టడీస్ పక్కన పెట్టి, మీకు అభిరుచి ఉన్న పనులు చేయాలి. అప్పుడే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరికొందరు వేళకు భోజనం చేయకుండా, నిద్రపోకుండా చదువుతుంటారు. ఇది కూడా సరైన విధానం కాదు. ఇవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. పైగా జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి సరైన నిద్ర, మంచి పౌష్టిక ఆహారం చాలా అవసరం.
  10. కన్సిస్టెన్సీ ఉండాలి!
    చాలా మంది మంచి ఉత్సాహంతో ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. కానీ దానిని కొనసాగించలేక ఇబ్బంది పడతారు. దీనికి ప్రధాన కారణం బద్ధకం. మరికొందరు చుట్టుపక్కల వారి మాటల వల్ల నిరాశకు లోనయ్యి, సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతుంటారు. నేటి కాలంలో పోటీ పరీక్షలు ఒక ప్రహసనంలా మారాయి. కనుక లాంగ్ టెర్మ్​ ప్రిపరేషన్​కు మానసికంగా సిద్ధం కావాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. మంచి బ్యాచ్​తో గ్రూప్ స్టడీ చేయవచ్చు. కానీ నెగిటివ్​ థాట్స్​ ఉన్నవారికి దూరంగా ఉండాలి. పాత పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్​పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ప్రిపరేషన్​ మానకూడదు. అప్పుడే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఆల్​ ది బెస్ట్!

Best Job Tips For Freshers : తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.