Application For New Gas Connection : దేశంలో పలు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో మనకు నచ్చిన కంపెనీ ద్వారా మనం గ్యాస్ పొందే అవకాశం ఉంది. ఇక్కడ మనం హిందుస్థాన్ పెట్రోలియం సరఫరా చేస్తున్న గ్యాస్ ను ఎలా పొందాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? వంటి వివరాలను చూద్దాం.
ఆన్ లైన్లో కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం..
New Gas Application Rules in Online :
- హెచ్‌పీ గ్యాస్ (HP LPG) కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా.. హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petrolium) అఫీషియల్ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో LPG "HP Gas" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- 'Apply Online' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కనిపించిన పేజీలో.. "Dealer Locator" గురించి అడుగుతుంది.
- డిస్ట్రిబ్యూటర్ పేరు ఫిల్ చేసిన తర్వాత.. ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది.
- అక్కడ అడిగిన మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి. గుర్తింపు కోసం ఆధార్, చిరునామా, ఫొటో కాపీ వంటి KYC డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. మొత్తం పూర్తయిన తర్వాత "Submit" క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ నగదు చెల్లించాలి. దీనికోసం.. క్రెడిట్/ డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో ఒకదాన్ని ఎంచుకొని చెల్లించాలి.
- చెల్లింపు పూర్తయిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో మీ ఆన్‌లైన్ సైన్ ఇన్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి.
- ఇప్పుడు www.myhpgas.in లోకి లాగిన్ అయిన తర్వాత.. మీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా.. LPG సబ్సిడీ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు.
'భారత్ గ్యాస్' వినియోగదారులకు సబ్సిడీ రాదా?
ఆఫ్‌లైన్ గ్యాస్ సిలిండర్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?
New Gas Application Rules in Offline :
- ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి.. మీ సమీపంలోని HP గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లాలి.
- అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. అందులో అడిగిన వ్యక్తిగత వివరాలను నింపాలి.
- ఫామ్ నింపిన తర్వాత, ఆధార్, ఫొటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి KYC డాక్యుమెంట్ల జిరాక్స్ డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాలి.
- కొత్త కనెక్షన్ కు సరిపడా డబ్బులను వారికి చెల్లించాలి. మీకు గ్యాస్ బుక్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
- గుర్తింపు కార్డు కోసం.. ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి వాటిలో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది.
- ఇంటి అడ్రస్ కోసం.. ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, టెలిఫోన్ బిల్లు, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు వంటి వాటిలో ఏదో ఒకటి ఇస్తే చాలు.
గ్యాస్ రీఫిల్ బుకింగ్..
How to Book Gas Refile :
- ఆన్ లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే.. వెబ్ సైట్లోకి లాగిన్ కావాలి.
- అక్కడ "Book My Cylendor"పై క్లిక్ చేయాలి.
- సిలిండర్ డెలివరీ కావాలనుకుంటున్న తేదీని క్లిక్ చేయాలి.
- ఆఫ్‌లైన్లో అయితే.. IVRS ఆప్షన్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం గ్యాస్ బుకింగ్ నంబర్ కు కాల్ చేయాలి.
- ఆ తర్వాత IVRSలో వాయిస్ మెసేజ్ అడిగిన వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. గ్యాస్ రీఫిల్ బుక్ అయిపోతుంది.
- రీఫిల్ బుకింగ్ నంబర్ కూడా SMS రూపంలో వస్తుంది. దాని ద్వారా గ్యాస్ డెలివరీని ట్రాక్ చేయవచ్చు.
గ్యాస్ కనెక్షన్ కావాలా? ఒక్క మిస్డ్‌కాల్ ఇవ్వండి
HP GAS యాప్ కూడా ఉంది..
How to Use HP Gas App
- ఆన్ లైన్ యాప్ ద్వారా కూడా HP GAS సేవలు పొంద వచ్చు. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఇన్స్టాల్ తర్వాత.. డిస్ట్రిబ్యూటర్ కోడ్, మొబైల్ నంబర్, కన్జ్యూమర్ కోడ్ సమర్పించాల్సి ఉంటుంది.
- యాక్టివేషన్ కోసం మొబైల్ కు SMS రూపంలో ఒక కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకోవచ్చు.
- సెక్యూరిటీ కోసం.. లావాదేవీ/బుకింగ్ కోసం ఈ యాప్‌ను ఉపయోగించే ప్రతిసారీ సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది.