ETV Bharat / bharat

పరీక్షకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం - జైపుర్​ రోడ్డు ప్రమాదాలు

రాజస్థాన్​ జైపుర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Jaipur accident news today) ఆరుగురు మృతిచెందారు. వాహనం అదుపు తప్పి ట్రక్కును ఢీకొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

jaipur latest news
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Sep 25, 2021, 11:45 AM IST

రాజస్థాన్​లోని జైపుర్​ జిల్లా చాక్సూ గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Jaipur accident news today) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. శనివారం రీట్​ పరీక్ష రాసేందుకు బారన్​ నుంచి సీకార్​ ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

అదే కారణం..

వాహనం అదుపు తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాధితులు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని.. ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మిగతా నలుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : స్నానం చేయట్లేదని భార్యకు విడాకులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.