రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వేటుపడింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన హరియాణా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుల పదవితో పాటు అన్ని పార్టీ పదవుల నుంచి కుల్దీప్‌ను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిష్కరించినట్లు కాంగ్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటువేసిన అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ ఓ ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. తాను క్రాస్ ఓటు వేసినట్లు స్వయంగా వెల్లడించారు. పార్టీ అభ్యర్థికి బదులుగా బీజేపీ, దాని మిత్రపక్షమైన జేజేపీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి శర్మకు బిష్ణోయ్ ఓటువేశారు. కాగా ఈ ఓటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోఉన్న అజయ్ మాకెన్ ఓటమిపాలయ్యారు. మాకెన్, కార్తికేయ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆరు గంటల పాటు నిలిచిపోయిన కౌంటింగ్.. అర్ధరాత్రి తర్వాత మళ్లీ మొదలైంది. అనంతరం ఫలితాలు వెలువడగా మాకెన్‌పై కార్తికేయ విజయం సాధించారు. హరియాణాలో రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే 31 ఓట్లు కావాలి. బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో మాకెన్‌కు 30 ఓట్లు పడ్డాయి. అందులో ఒకటి చెల్లలేదు. దీంతో కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు.
ఇదీ చదవండి: