ETV Bharat / bharat

margadarshi chitfund : 'ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం' - మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ

margadarshi chitfund : మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థపై ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. చందాదారులను బెదిరించేందుకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ పత్రికా ప్రకటనలు ఇస్తోంది. మార్గదర్శి సంస్థ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఏపీ ప్రభుత్వం పదే పదే పాత ఆరోపణలనే మళ్లీ గుప్పిస్తోంది. తాజాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ప్రభుత్వం చేసిన నిందారోపణలు, వాటిలోని నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం వేధింపులు
మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం వేధింపులు
author img

By

Published : Jul 30, 2023, 6:49 PM IST

Updated : Jul 31, 2023, 6:18 AM IST

మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం వేధింపులు

margadarshi chitfund : మార్గదర్శి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి ఆరోపణ ఏంటంటే... 'మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద ఉన్న టికెట్స్‌కు, కంపెనీ వారు చెల్లించాల్సిన డబ్బులు కాకుండా ఈ గ్రూపునకు సంబంధం లేని సభ్యులు చెల్లించిన చందా డబ్బుతో చెల్లింపులు పూర్తిచేశారు. ఇది చట్ట ఉల్లంఘన. నియమావళి మేరకు కంపెనీ ఆధీనంలోని టికెట్స్‌కు మార్గదర్శి ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు, సొంత నిధులతో మాత్రమే చెల్లింపులు చేయాలి.' ఇదీ ప్రభుత్వ ఆరోపణ.

కానీ, వాస్తవం ఏంటంటే.... ప్రతి ఒక్క చిట్‌ గ్రూపులో కంపెనీ చెల్లింపులకు సంబంధించి అత్యున్నత అకౌంటింగ్‌ వ్యవస్థ ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ 2004లో జారీచేసిన సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం మాండేటరీ చిట్‌తోపాటు ఖాళీ చిట్స్‌లోనూ ఫోర్‌మన్‌ చందాను గుర్తించడానికి ఒక వ్యాపార విధానం ఉంది. మాండేటరీ చిట్‌తోపాటు, అవసరమైనప్పుడు ఖాళీ చిట్‌కూ ఫోర్‌మన్‌ చందా సమకూర్చగలిగినన్ని నిధులు బ్యాంకు ఖాతాలో ఉన్నప్పుడు, దాన్ని ఆధారంగా చేసుకొని ఖాతా పుస్తకాల్లో పద్దులు రాస్తారు. అయితే ఇక్కడ కంపెనీ అలాంటి చందా కట్టలేదన్న పరిస్థితే ఉత్పన్నం కాదు. పాడుకున్న చీటీ పాట మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కంపెనీ ఎప్పటికప్పుడు చందాదారులకు చెల్లిస్తోంది. ఈ నిజం ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. చందాదారులు ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం జరిగినచోట చీటీ పాట మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆ మొత్తాన్ని చిట్‌ఫండ్‌ యాక్ట్‌ 1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం రెండో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పదలచిన మరో విషయం ఏంటంటే... చట్టంలోని సెక్షన్‌ 21(1)(ఎ) కింద ఖాతా నుంచి స్థూల చిట్‌ మొత్తాన్ని తీసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థలో తగినంత మేర నగదు చలామణి జరగడానికి ఆ మొత్తాన్నీ సంస్థ అదే ఖాతాలోనే ఉంచుతోంది. మాండేటరీ చిట్‌తోపాటు అవసరమైతే ఖాళీ చిట్‌కు చందా సమకూర్చడానికి ఫోర్‌మన్‌కు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఖాతా పుస్తకాల్లో చిట్‌ బకాయి ఉన్నట్లు నమోదు చేసినప్పుడల్లా బ్యాలెన్స్‌ షీట్‌లోనూ దాన్ని బకాయిగానే చూపుతారు. ఏదైనా గ్రూప్‌లోని ఖాళీ చిట్‌లో పెట్టిన పెట్టుబడిని ఆ చిట్‌లోకి కొత్త చందాదారులు చేరిన వెంటనే ఎప్పటికప్పుడు నెలవారీగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. మాండేటరీ చిట్‌ కాకుండా మరేదైనా చిట్‌ గ్రూప్‌ పూర్తయ్యేవరకూ భర్తీకాకపోతే, ఆ చిట్‌ను చివరి వరకూ కొనసాగించడంతోపాటు, ఆ గ్రూప్‌ సభ్యుల్లోని చందాదారులకు పారదర్శకంగా పూర్తిగా చెల్లింపులు జరిగిన తర్వాతే ఆ మొత్తాన్ని డ్రా చేస్తున్నారు. చివరి వరకు పెట్టుబడి పెట్టిన ఆ మొత్తాన్ని ఆ గ్రూప్‌ గడువు పూర్తయిన చివరి నెలలో తీసుకున్నప్పటికీ... బ్రాంచ్‌లకు నగదు ప్రవాహాన్ని బలోపేతం చేయడానికి ఆ మొత్తాన్నంతా వ్యవస్థలోనే ఉంచుతున్నారు. మాండేటరీ చీటీలు, అప్పుడప్పుడూ ఖాళీగా ఉండే చీటీలకు ఫోర్‌మన్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న నిధుల నుంచే పూర్తిగా చందాలు సమకూరుస్తున్నారు. అందుకు సంబంధించిన పద్దులను ప్రతినెలా ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. ఖాళీ చీటీలలో కొత్త చందాదారులు చేరిన వెంటనే అందులో పెట్టుబడులను తిరిగి నింపడం జరుగుతోంది. అందువల్ల మాండేటరీ చిట్‌లకు, ఖాళీ చిట్‌లకు కంపెనీ చందాలు సమకూర్చడం లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదు. చిట్‌లు పాడుకున్న చందాదారులకు వారికి రావాల్సిన మొత్తాన్ని ప్రతినెలా ఎలాంటి జాప్యం లేకుండా చెల్లిస్తున్నట్లు సంపూర్ణమైన సాక్ష్యాలున్నందున ఈ ఆరోపణ పూర్తి నిరాధారం.

రెండో ఆరోపణ విషయానికొస్తే... "చిట్‌ కంపెనీ వారు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వేరే గ్రూపునకు సంబంధించిన చందాదారుల డబ్బులను దారి మళ్లించడం వల్ల, పాటపాడుకున్న చందాదారులకు చాలా ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించడమైనది. చిట్‌ పాటదారులకు కొన్ని సందర్భాల్లో నాలుగు నెలలకు మించి చెల్లింపులు ఆలస్యం చేశారు"

వాస్తవం: బ్యాంకు ఖాతాలో నిధులు అందుబాటులో ఉండటం వల్ల కంపెనీ ఎప్పటికప్పుడు చందాలు చెల్లించి ఆ విషయాన్ని పద్దుల్లో చూపుతోంది. అందువల్ల నగదు కొరత కారణంగా, చీటీలు పాడుకున్న చందాదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రసక్తే లేదు. ఒక చిట్‌ గ్రూపులోని మొత్తాన్ని మరో గ్రూప్‌ చెల్లింపులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా తప్పు. చట్టం ప్రకారం వివిధ గ్రూప్‌ చందాదారుల నుంచి వసూలు చేసిన చందాలను ఆ శాఖలో కుదుర్చుకున్న చిట్‌ ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. చీటీ పాడుకున్న చందాదారుకి చట్ట ప్రకారం అదే బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్‌ల వద్ద సమర్పిస్తున్నారు. చిట్‌ఫండ్‌ చట్టం-1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం చిట్‌ పాట మొత్తాన్ని బ్యాంకు ఖాతా నం.1 నుంచి చెల్లించినప్పుడు, అలాగే ఖాతా నం.2కి జాగ్రత్తగా బదిలీ చేసినప్పుడు ఒక గ్రూప్‌కి చెందిన చందా మొత్తాలను మరో గ్రూప్‌లో పాడుకున్న చీటీదారుల చెల్లింపులకు ఉపయోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరైనా చందాదారుడు పాట పాడుకున్నప్పుడు అతను భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా మొత్తానికి సెక్యూరిటీ సమర్పించమని అడిగే హక్కును చట్టంలోని సెక్షన్‌ 21(1) ఫోర్‌మన్‌కు కల్పిస్తోంది.

ఇలాంటి సమయంలో చందాదారులు భవిష్యత్తులో చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకోమని కోరడంతోపాటు ష్యూరిటీలు / గ్యారంటీలు, సెక్యూరిటీ మొత్తాలు, ఎల్‌ఐసీ తనఖా, బ్యాంకు గ్యారంటీలు, ఆస్తుల తనఖా పెట్టడంలాంటివి చేస్తుంటారు. వాళ్లు భవిష్యత్తులో చెల్లించాల్సిన మొత్తానికి వీటిని సమర్పిస్తుంటారు. ఇలాంటి సమయంలో కంపెనీ తనకున్న హక్కులను ఉపయోగించుకొని సదరు చందాదారు సమర్పించిన ష్యూరిటీల్లోని బలాబలాలను పరిశీలించుకుంటుంది. ఆ గ్రూప్‌లోని చీటీలు పాడుకోని చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ పనిచేస్తుంది. అది అవసరం కూడా. చీటీ పాడుకున్న చందాదారు తగిన సెక్యూరిటీ సమర్పించిన తక్షణం చెల్లింపులు చేస్తున్నారు. చీటీ పాడుకున్న చందాదారు ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం చేస్తే, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లించడానికి ముందే చట్టప్రకారం ఆమోదించిన ప్రత్యేక ఖాతాలో డిపాజిట్‌ చేసి, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న వివరాలను సదరు చందాదారుతోపాటు, రిజిస్ట్రార్‌కూ లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి జాప్యం జరగడంలేదు. చీటీ పాడుకున్న మొత్తానికి సరిపడా అవసరమైనంత సెక్యూరిటీ కోరే హక్కు కంపెనీకి ఉంది. ఈ విషయంలో కంపెనీ చట్టంలోని నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తోంది.

ఆరోపణ 3: నూతన చిట్‌ ప్రారంభించే సమయంలో తగు అనుమతులు పొందకుండా చిట్‌ మెంబర్స్‌ నుంచి ఎలాంటి మొత్తాలు స్వీకరించకూడదు. కానీ చిట్‌ఫండ్‌ నియమావళిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పబ్లిక్‌ నుంచి నిధులు స్వీకరించడం జరిగింది.

వాస్తవం: చిట్‌ఫండ్స్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 4 ప్రకారం ప్రీవియస్‌ శాంక్షన్‌ ఆర్డర్‌ (పీఎస్‌ఓ) స్వీకరించిన తర్వాతే కంపెనీ చందాదారుల పేర్లను నమోదు చేసుకుంటోంది. అలా నమోదు చేసుకున్న చందాదారు తన స్వీయ విచక్షణ మేరకు వేలంపాటకు ముందు చందా మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్ని సమయాల్లో చందాదారు ముందస్తుగానే చందా మొత్తాన్ని చెల్లిస్తుండొచ్చు. చందాదారులు స్వీయ సౌకర్యార్థం చెల్లిస్తే తప్ప కంపెనీ ఎప్పుడూ తొలి వాయిదాకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించమని చందాదారుడిని కోరదు. అలా వచ్చిన చందాలన్నింటినీ ఖాతా పుస్తకాల్లో ప్రత్యేకంగా ముందస్తు చందాలుగా రాయడంతోపాటు, బ్యాలన్స్‌షీట్‌లో వాటిని బకాయిలు అన్న హెడ్‌ కింద చూపుతోంది. ప్రారంభానికి ముందే చందా మొత్తాన్ని స్వీకరించకూడదని చిట్‌ఫండ్స్‌ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాన్ని నిరోధించే నిబంధన కూడా ఎక్కడా లేదు. అయితే కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చడానికి రిజిస్ట్రార్లు ఊహాజనితమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

ఆరోపణ 4: చిట్‌ గ్రూపులోని చందాదారులు వారి అవసరాలకు చిట్‌ పాట పాడుకోగా, వారికి సకాలంలో చిట్‌ మొత్తాన్ని చెల్లించకుండా చిట్‌ నిబంధనల పేరుతో సరైన హామీలను (సెక్యూరిటీ) సమర్పించలేదనే కారణంతో, వడ్డీ ఆశ చూపించి భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాకు హామీగా (సెక్యూరిటీగా) చిట్‌ మొత్తాన్ని కంపెనీ వద్దే డిపాజిట్‌ చేసుకుని 4% లేదా 5% వడ్డీ చెల్లిస్తామని రశీదులు ఇచ్చి ఎలాంటి మొత్తాలు చిట్‌ పాడుకున్న వారికి చెల్లించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

వాస్తవం: చిట్‌ పాడుకున్న చందాదారుడు ఇకపై చెల్లించాల్సిన చందా మొత్తాలకు తగిన పూచీకత్తును పొందేందుకు చట్టంలోని సెక్షన్‌ 21(1)(ఈ) ప్రకారం ఫోర్‌మన్‌కు హక్కు ఉంది. చిట్‌ ఒప్పందంలో ఉన్న పద్ధతిని అనుసరించి చందాదారులు తాము ఇకపై చెల్లించాల్సిన మొత్తాలను మినహాయించుకోవాలని చెప్పడం, పూచీకత్తు(ష్యూరిటీ)లు ఇవ్వడం, హామీ (సెక్యూరిటీ) మొత్తాలు చూపించడం, ఎల్‌ఐసీ పాలసీలను తాకట్టు పెట్టడం, బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం, ఆస్తులు తాకట్టు పెట్టడం వంటివి చేస్తారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యాలయం తనకున్న హక్కును వినియోగించుకుంటూ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. హామీగా చూపినవి ఎంత బలంగా ఉన్నాయో చూస్తుంది. గ్రూపులో చీటీ ఇంకా పాడుకోని చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇది అవసరం, సముచితం. చీటీ పాడుకుని.. కంపెనీని సంతృప్తిపరిచేలా తగిన హామీలు సమర్పించిన వారికి త్వరగా, సులభంగా చెల్లింపులు చేయడంలో పరిశ్రమలో ఉత్తమమైనదిగా మార్గదర్శికి పేరుంది. చందాదారుడు కోరుకున్నట్లయితే.. భవిష్యత్తులో ఇంకా చెల్లించాల్సిన వాయిదాల సొమ్ముకు సెక్యూరిటీ మొత్తాన్ని ఫోర్‌మన్‌ అనుమతించవచ్చని 2016లో భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గనిర్దేశకాల మూడో అధ్యాయంలో ఉంది. చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని ‘మిస్లేనియస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీలు’గా ఆర్‌బీఐ వర్గీకరించింది. అందువల్ల ప్రస్తుత, లేదా భవిష్యత్తు వాయిదాలుగా చెల్లించే చందా మొత్తాలు ‘డిపాజిట్‌’ కిందికి రావు. అవి డిపాజిట్‌ నిర్వచనం వెలుపలే ఉంటాయి. ఆర్‌బీఐ చట్టంలోని 45-ఐ (బిబి) సెక్షన్‌ ప్రకారం ‘డిపాజిట్‌’కు ఉన్న నిర్వచనాన్ని చూసినా-ఒక చిట్‌ కంపెనీ వసూలు చేసే చందాలు డిపాజిట్‌ కిందికి రావని స్పష్టమవుతోంది.

ఆరోపణ 5: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శాఖకు చెందిన ఖాతా నిర్వహణ చిట్‌ నియమావళి మేరకు ఆ శాఖకు సంబంధించిన ఫోర్‌మన్‌ ఆధీనంలో ఉండాలి. కానీ ఈ శాఖలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నిర్వహణ ఆ శాఖ ఫోర్‌మన్‌ కాకుండా వారి కేంద్ర కార్యాలయంలో పనిచేసే అనధికార సిబ్బందిచే నిర్వహిస్తూ చిట్‌ నిధులను చట్ట విరుద్ధంగా దారి మళ్ళిస్తున్నారు.

వాస్తవం: చట్ట నిబంధనలు, నియమాల ప్రకారం ప్రతి బ్రాంచికి మూడు చొప్పున బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఫోర్‌మన్, అంటే కంపెనీకి అధీకృత ప్రతినిధిగా బ్రాంచి మేనేజర్‌ వ్యవహరిస్తారు. బ్రాంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ, నియంత్రణలపై మేనేజర్లకు పూర్తి అవగాహన ఉంటుంది. బ్రాంచిలో చిట్‌ కార్యకలాపాలన్నింటికీ మేనేజర్‌ ఇన్‌ఛార్జిగా ఉంటారు. సమర్థమైన కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ కోసం.. హైదరాబాద్‌లోని కంపెనీ నమోదిత కార్యాలయంలో సీనియర్‌ సిబ్బందికి చెక్కులపై సంయుక్తంగా సంతకాలు చేసే అధికారం మాత్రం ఉంటుంది. అయితే కేవలం సంబంధిత బ్రాంచి మేనేజర్ల సూచనల మేరకే చెక్కులు జారీ అవుతాయి. చందాదారులకు పంపిణీ చేయడానికి వీలుగా వీటిని బ్రాంచిలకే పంపిస్తారు. చట్ట ప్రకారం కార్యకలాపాలన్నీ బ్రాంచిలోనే జరుగుతాయి. చందాదారుల డబ్బును మళ్లించడమంటూ జరగదు. ఎందుకంటే బ్రాంచిలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కేవలం ప్రైజ్‌ మొత్తాల చెల్లింపులకు, లేదా.. చెల్లించాల్సి ఉన్న ప్రైజ్‌ మొత్తాలను చిట్‌ఫండ్‌ చట్టం-1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం విడిగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి మాత్రమే వినియోగిస్తారు. అందువల్ల కార్పొరేట్‌ కార్యాలయం నుంచి బ్యాంకు ఖాతాలను కంపెనీ అక్రమ మార్గాల్లో నిర్వహిస్తోందని చెప్పడం నూటికి నూరు శాతం అవాస్తవం.

ఆరోపణ 6: చందా చెల్లింపులలో డీ-ఫాల్ట్‌ అయిన లేదా ఎలాంటి చందా చెల్లించని వారి పేరు మీద చిట్‌ పాట పాడి నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

వాస్తవం: సకాలంలో కిస్తీలు వసూలు కాకపోవడమనే సమస్య ఆర్థిక రంగంలో సహజంగానే తలెత్తుతూ ఉంటుంది. చందాదారులతో పరస్పర విశ్వాసం ప్రాతిపదికన కంపెనీ నడుస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా చిట్‌ గ్రూపును నడిపిస్తుంది.

ప్రతినెలా తన వాటా కిస్తీని చెల్లించిన తర్వాతే వేలం పాటలో పాల్గొనటానికి చందాదారుకు అనుమతి లభిస్తుంది. వేలం పాటలో చందాదారు పాడుకున్న(ప్రైజ్‌మనీ) మొత్తం నుంచి గతంలో బకాయిపడిన సొమ్మును కంపెనీ మినహాయించుకుంటుంది. భవిష్యత్తు కిస్తీలకు అవసరమైన పూచీకత్తు సమర్పించిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని చందాదారుకు కంపెనీ అందజేస్తుంది. సరైన పూచీకత్తు లభించక పాడుకున్న మొత్తాన్ని చందాదారుకు చెల్లించని పక్షంలో... చిట్‌ అగ్రిమెంట్‌లో పేర్కొన్న చట్టంలోని సెక్షన్‌ 22(2) ప్రకారం తదుపరి వాయిదాకు ముందే అధీకృత బ్యాంకులోని ప్రత్యేక ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇలా జమ చేయడానికి గల కారణాలను చిట్‌ పాడుకున్న చందాదారుతో పాటు రిజిస్ట్రార్‌కు కూడా లిఖితపూర్వకంగా కంపెనీ తెలియజేస్తుంది. చిట్‌ పాడుకున్న చందాదారు సరైన పూచీకత్తు సమర్పించకపోవడం వల్ల బ్యాంకు ప్రత్యేక ఖాతాలో జమచేయాల్సి వచ్చిన ప్రైజ్‌ మనీని ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన కిస్తీలకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. చిట్‌ గ్రూప్‌లోని ఇతర చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కంపెనీ ఈ సర్దుబాటు చేస్తూ ఉంటుంది. ఇలా ఓ క్రమపద్ధతిలో చందాదారు ప్రైజ్‌మనీని చిట్‌ గ్రూప్‌నకు బదిలీ చేయాల్సిరావడం వల్ల దీనికి సంబంధించిన మిగులు సొమ్ము ఏదీ కంపెనీకి అందుబాటులో ఉండదు. అది పూర్తిగా చిట్‌ గ్రూప్‌నకే చేరుతూ ఉంటుంది. బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచిన సొమ్మును సంబంధిత చిట్‌ గ్రూప్‌నకే సకాలంలో బదిలీ చేయాల్సి ఉన్నందున అటువంటి మొత్తాలను అక్రమంగా దారి మళ్లించే పరిస్థితే ఉత్పన్నం కాబోదు.

ఆరోపణ 7: చిట్‌ఫండ్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 24, రూల్‌ 28 నిబంధన మేరకు సమర్పించాల్సిన బ్యాలన్స్‌ షీట్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌ షెడ్యూల్‌ 1, 2 మేరకు, సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సమర్పించవలసి ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాలన్స్‌ షీట్‌లు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌లు సమర్పించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు.

వాస్తవం: బ్యాలన్స్‌ షీట్‌ తయారీ, సమర్పణ గురించి 1982 చిట్‌ఫండ్‌ చట్టంలోని 24వ సెక్షన్‌ చెబుతోంది. అంటే దానర్థం 1956 కంపెనీల చట్టంలోని నిబంధనలకు భంగం కలగకుండా ప్రతి ఫోర్‌మన్‌ నిర్ణీత సమయంలోగా బ్యాలన్స్‌ షీట్‌ను తయారుచేసి రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి క్యాలెండర్‌ ఏడాదిలోని ఆఖరు తేదీనగానీ, ఫోర్‌మన్‌ తాను నిర్ణయించుకున్న ఆర్థిక సంవత్సరం ఆఖరునగానీ బ్యాలన్స్‌ షీట్‌తోపాటు ఆ ఏడాదిలోని లాభనష్టాలను సమర్పించవచ్చు. చిట్‌ వ్యాపారానికి, కంపెనీల చట్టం-1956కు లోబడి అర్హత కలిగిన ఆడిటర్లుగానీ, సెక్షన్‌ 61 కింద నియమితులైన ఆడిటర్లుగానీ ఇచ్చే ఆడిట్‌ నివేదికలను బట్టి పరిస్థితులకు అనుగుణంగా బ్యాలన్స్‌ షీట్, లాభనష్టాల వివరాలను రిజిస్ట్రార్‌కు అందజేయవచ్చు. ఆ ప్రకారమే ఆడిటర్లు ఆడిట్‌ చేసి ధ్రువీకరించిన వార్షిక బ్యాలన్స్‌ షీట్లను, లాభనష్టాల వివరాలను.. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన భారతీయ ఖాతాల నిర్వహణ ప్రమాణాలకు లోబడి కంపెనీ అందజేస్తోంది. చట్టంలోని సెక్షన్‌ 24 కింద కోరిన వివరాల ప్రకారం చూస్తే అధిక వివరాలను బహిర్గతపరచడంతోపాటు అదనపు విషయాలనూ అందజేస్తున్నట్లే. గత 60 ఏళ్లుగా నిజాయతీగా కంపెనీ ఈ వివరాలిస్తోంది. చట్టానికి, నిబంధనలకు మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు చట్టంలోని అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలనేది అందరూ ఆమోదించే న్యాయం. వేలల్లో చిట్‌ గ్రూపులున్నప్పుడు ప్రతి చిట్‌ గ్రూపునకూ ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవడం, చిట్‌ల వారీగా బ్యాలన్స్‌ షీట్‌ను తయారు చేయడం, లాభనష్టాలను చూపించడం ఆచరణలో సాధ్యం కాదు. ఆంధ్రపదేశ్‌లో 1800కుపైగా చిట్‌ గ్రూపులున్న ఒక కార్పొరేట్‌ సంస్థకు ఇది ఎలా సాధ్యమవుతుంది. పైగా చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 89లోని 28(2) నిబంధన అలా ప్రతి చిట్‌కూ ఖాతా తప్పనిసరిగా ఉండాలనీ చెప్పలేదు. అలా అడగాలనే అధికారమూ అధికారులకు ఇవ్వలేదు. అంటే 28(2) నిబంధన కింద చిట్‌ల వారీగా బ్యాలన్స్‌ షీట్‌లను డిమాండు చేసే అధికారం లేదని స్పష్టమవుతోంది. అసాధ్యమైన వాటిని చేయాల్సిందేనని బలవంతపెట్టవద్దని చట్టంలో ఉంది. దీనిని ఎల్‌ఐసీ వర్సెస్ సీఐటీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 219 ఐటీఆర్‌ 410 వర్సెస్ నర్మదా బచావో ఆందోళన్‌ (2011) 7 ఎస్‌సీసీ 639 కేసుల్లో స్వయంగా సుప్రీంకోర్టు సమర్థించింది.

Last Updated : Jul 31, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.