ETV Bharat / bharat

కొవొవాక్స్‌ అత్యవసర వినియోగానికి సిఫార్సు - భారత్​లో కార్బోవ్యాక్స్​కు అనుమతులు

Covovax In India: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్‌'కు, బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని.. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది.

Covovax, Corbevax
కొవొవాక్స్‌, కార్బెవాక్స్‌
author img

By

Published : Dec 28, 2021, 7:11 AM IST

Covovax In India: దేశంలో మరో రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి మార్గం సుగమమైంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్‌'కు, బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని... కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసింది.

బ్రిటన్‌, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది. ఈ క్రమంలోనే సీడీఎస్‌సీవో నిపుణుల బృందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం తాజాగా సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బెవాక్స్‌కు అనుమతిని ఇచ్చింది.

ఇవీ చూడండి:

ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు జనవరి 10 నుంచి మూడో​ డోసు

గోవా, మణిపుర్​లో తొలి ఒమిక్రాన్ కేసు- కేరళలో నైట్ కర్ఫ్యూ

కొవిడ్‌ సోకిన ఏడు నెలల వరకు శరీరంలోనే వైరస్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.