ETV Bharat / bharat

టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై? అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్​! - ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్​

బంగాల్.. క్రిష్ణానగర్​ ఎంపీ మహువా మొయిత్రా.. టీఎంసీ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్​ ఖాతాను ఆమె బుధవారం అన్​ఫాలో చేశారు. 'కాళీ' పోస్టర్​కు సంబంధించి ఆమె చేసిన మతపరమైన వ్యాఖ్యలు.. పార్టీకి సంబంధం లేవని టీఎంసీ ట్వీట్​ చేసింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఆమె పార్టీకి గుడబై చెప్పడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు, ఆమెను అరెస్ట్​ చేయాలని భాజపా డిమాండ్​ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కోరింది.

Goddess Kaali poster row: Mahua Moitra unfollows TMC; BJP protests

author img

By

Published : Jul 6, 2022, 2:04 PM IST

Mahua Moitra TMC Party: తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ మహువా మొయిత్రా గుడ్‌బై చెప్పనున్నారా..? మహువా, పార్టీ మధ్య తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్​ ఖాతాను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు కారణంగా కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

Goddess Kaali poster row: Mahua Moitra unfollows TMC; BJP protests
తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra Kaali Poster Row: మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మహువా మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం 'కాళీ'కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దానిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. వాటిపై తీవ్ర విమర్శలకు వ్యక్తం అయ్యాయి. సొంత పార్టీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటితో తమకూ ఏ సంబంధం లేదంటూ దూరం జరిగింది.

మహువా ట్విట్టర్​ ఎకౌంట్​

'చర్చా కార్యక్రమంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా ఆమె వ్యక్తిగతం. దానికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్‌ ఆ తరహా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తోంది' అంటూ పార్టీ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విట్టర్​ ఖాతాను ఆమె అన్‌ఫాలో చేశారు. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఖాతాను మాత్రం అనుసరిస్తున్నారు. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మహువా స్పందించారు. తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు. మహువా ప్రస్తుతం క్రిష్ణానగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్‌లో అయినా.. సామాజిక మాధ్యమాల వేదికల్లో అయినా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడిస్తారు.

సస్పెండ్​ చేయాలంటూ భాజపా డిమాండ్​.. ఓ చర్చా కార్యాక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను అరెస్ట్​ చేయాలని ఆ రాష్ట్ర భాజపా చీఫ్​ డిమాండ్​ చేశారు. అంతేకాకుండా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కోరారు. భాజపా కార్యకర్తలు బౌబజార్​ పోలీస్​స్టేషన్​ వద్దకు చేరుకుని మొయిత్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ముదురుతున్న 'కాళీ' పోస్టర్​ వివాదం.. డైరెక్టర్​, ప్రొడ్యూసర్​పై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.