Girl fell down naked: బంగాల్‌కు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. వారిద్దరు పానిపట్‌లో వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి పానిపట్‌లోని ఓ షాపింగ్ మాల్లో పనిచేయడం మొదలుపెట్టింది.
ఈ సమయంలోనే గ్రేటర్ నోయిడాలోని ఓ ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నితిన్ గుప్తతో ఆ యువతికి పరిచయమైంది. అతను ఓ కెమికల్ ఇంజినీర్.
ఈ నెల 12న ఉదయం.. నితిన్ గుప్త నివాసం కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నితిన్ గుప్తను విచారించారు పోలీసులు. 'కొవిడ్ కారణంగా.. నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాము. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి బాత్రూంకు వెళ్లింది. బాత్రూం కిటికీలో నుంచి బయటకు పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది' అని నితన్.. పోలీసులకు చెప్పాడు.
యువతి ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. అయితే తమ బిడ్డ ఐదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, అప్పుడే తమ దృష్టిలో ఆమె చనిపోయిందని తెలిపారు.
ఈ పూర్తి వ్యవహారంపై గ్రేటర్ నోయిడా బేటా-2 పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:- బైక్‌ను ఢీకొట్టిన లారీ.. కవల పిల్లలు నుజ్జునుజ్జు