ETV Bharat / bharat

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్​రేప్​.. ఆపై బయటికి తోసేసి.. - ఉత్తర్​ప్రదేశ్​లో ప్రయాగ్​రాజ్ క్రైమ్ న్యూస్

కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. అనంతరం బాధితురాలిని కారులో నుంచి కిందకి తోసేశారు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన ఓ ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

gangrape in moving car
gangrape in moving car
author img

By

Published : May 15, 2023, 10:36 PM IST

Updated : May 15, 2023, 10:46 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో దారుణం జరిగింది. బీమా కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగింది. అఘాయిత్యం అనంతరం నిందితులు.. బాధితురాలిని కారు నుంచి బయటకు తోసేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమేఠికి చెందిన ఓ యువతి ప్రయాగ్‌రాజ్‌లో నివాసం ఉంటూ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తెలిసిన ఓ యువకుడు బీమా పాలసీని ఇప్పిస్తానని నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం బాధితురాలికి మత్తుమందు కలిపిన నీరును ఇచ్చాడు. ఆ నీరు తాగి యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలి స్నేహితుడు.. అతని సహచరులు కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రతాప్​గఢ్​ వరకు(దాదాపు 60 కి.మీ) ఆమెను కారులో తిప్పారు. కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం చేశారు.

అనంతరం బాధితురాలిని ప్రతాప్​గఢ్​లో రోడ్డు పక్కన పడేసి.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతిని అంబులెన్స్​లో ప్రతాప్‌గఢ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితురాలికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. బాధితురాలు కాస్త కోలుకున్నాక సోమవారం ఉదయం ప్రతాప్​గఢ్​ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసున్నారు.

"నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. వినియోగదారులకు ఫోన్ చేసి పాలసీల గురించి ఫోన్​లో మాట్లాడతా. అలాగే వారి సందేహాలను నివృత్తి చేస్తా. మే 12 సాయంత్రం.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక యువకుడు ఫోన్ చేశాడు. బీమా తీసుకునేందుకు ఓ వ్యాపాపవేత్త ఆసక్తి చూపుతున్నారని చెప్పాడు. బీమా కావాలంటే హనుమాన్ గుడి దగ్గరికి రమ్మన్నాడు. అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లా. నాకు అబద్దం చెప్పి కారులో కూర్చోబెట్టాడు. నేను కారు దిగిపోయేందుకు ప్రయత్నించా. అతడు కారును ఆపలేదు. వేగంగా ఝాన్సీ వైపు నడిపాడు. నన్ను గాబరా పడొద్దని.. వాటర్ బాటిల్​తో నీరు ఇచ్చాడు. నేను ఆ నీరు తాగగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. అనంతరం కొందరు దుండగులు వచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డారు."
-బాధితురాలు

మైనర్​పై రేప్​.. 20 ఏళ్లు జైలు శిక్ష..
ఒడిశాలో మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ తీర్పును బాలాసోర్ పోక్సో కోర్టు ఇచ్చింది. దోషికి రూ.5 వేలు జరిమానా సైతం విధించింది.
ఇదీ జరిగింది..
2019లో రాంపుర్​కు చెందిన ఓ టీచర్​ చాక్లెట్ ఆశచూపి మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బాలాసోర్ పోక్సో కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.

Last Updated : May 15, 2023, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.