ETV Bharat / bharat

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి - భజరంగ్ దళ్ ధర్నా

ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు యువకుడు. బాధితురాలు కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఝూర్ఖండ్​లోని దుమ్కాలో జరిగింది.

set in fire by lover
ప్రేమను ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
author img

By

Published : Aug 28, 2022, 5:20 PM IST

Updated : Aug 28, 2022, 9:51 PM IST

ఝూర్ఖండ్ దుమ్కాలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. బాధితురాలు రిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు వైద్యులు. నిందితుడు షారుక్ హుస్సేన్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

set in fire by lover
మృతురాలు అంకిత

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అంకితను ప్రేమించమని వేధింపులకు గురిచేసేవాడు షారుక్ హుస్సేన్ అనే యువకుడు. అందుకు అంకిత అంగీకరించకపోవడం వల్ల ఆగస్టు 23వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడం వల్ల దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసేశారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు షారుక్​​ను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.

set in fire by lover
ప్రేమను ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

"నా కుమార్తె ఫోన్ నెంబరును నిందితుడు షారుక్ సంపాదించాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి స్నేహితులుగా ఉందామని వేధించేవాడు. ప్రేమించమని ఒత్తిడి చేసేవాడు. అందుకు అంకిత ససేమిరా అనడం వల్ల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతకముందు తన మాట వినకపోతే అంకితను ప్రాణాలతో వదలనని బెదిరించాడు. ఇప్పడు నా కుమార్తె ప్రాణాలు తీశాడు. నిందితుడికి మరణశిక్ష విధించాలి."
-- సంజీవ్ సింగ్, బాధితురాలి తండ్రి

ఇవీ చదవండి: చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్​ లేక కాలినడకన

చిన్నారి కళ్లు, నోట్లో ఫెవిక్విక్ పోసి చెరువులో పడేసిన ఉన్మాది, కుక్కపై అత్యాచారం

Last Updated : Aug 28, 2022, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.