ETV Bharat / bharat

'మతం మారి పెళ్లి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా' - రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆ దారుణాన్ని వీడియో తీసి.. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. మరోవైపు, అత్తతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

gang rape
సామూహిక అత్యాచారం
author img

By

Published : Nov 26, 2022, 10:31 AM IST

ఉత్తర్​ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్​ నిర్వహిస్తున్న ఓ మహిళను గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోమని మహిళను బెదిరించాడు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్​మెయిల్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలు తన ఇంట్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. తరన్నమ్, గజాలా అనే ఇద్దరు మహిళలు.. బ్యూటీ పార్లర్​కు వచ్చేవారు. అలా బాధితురాలితో వారిద్దరు పరిచయం పెంచుకున్నారు. ఓ సారి బాధితురాలిని తరన్నమ్​ తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. అప్పుడు ఆమె సోదరుడు అక్లీమ్​.. బాధితురాలిని గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని అతని ఇద్దరు సోదరీమణులు వీడియో తీశారు. బాధితురాలు మతం మార్చుకుని అక్లీమ్​ను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో వైరల్​ చేస్తామని బెదిరించారు. వారి మాటలకు బెదిరిపోయిన బాధితురాలు.. అక్లీమ్​తో వివాహానికి బలవంతంగా ఒప్పుకుంది.

బాధితురాలు తన నగలను నిందితుడికి ఇచ్చింది. మత్తుమందు ఇచ్చి నిందితుడు ఆమెను బరేలీ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి దస్తావేజుపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం ఆగ్రాకు తీసుకెళ్లాడు. అప్పుడు అక్లీమ్ సోదరులు షాదల్, విసల్​ కూడా ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబరు 23న బాధితురాలు నిందితుల చెరనుంచి బయటపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని హతమార్చాడు ఆమె అల్లుడు. ఈ ఘటన మహారాష్ట్ర.. ముంబయిలో వెలుగుచూసింది. హత్యకు నిందితుడి స్నేహితుడు కూడా సాయపడ్డాడు. రాజ్‌కుమార్ దీక్షిత్ (33), హేమేంద్ర గుప్తా(38)ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరచగా నవంబరు 25వరకు పోలీస్ కస్టడీ విధించింది. పోలీసుల ఎదుట నిందితులు నేరాన్ని అంగీకరించారు. మృతుడు బంగాల్​కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

రెండున్నరేళ్ల చిన్నారిపై..
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని కోతాబాఘ్​లో​ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతం.. మెరుగైన వైద్యం కోసం సుశీల తివారీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు బంగాల్​కు చెందిన కూలీ అని పేర్కొన్నారు.

మైనర్​తో ఉపాధ్యాయుడు..
బిహార్ బెగుసరాయ్​లో దారుణం జరిగింది. ట్యూషన్​కు వెళ్లిన 14 ఏళ్ల మైనర్​ను తీసుకెళ్లిపోయాడు ఓ ఉపాధ్యాయుడు. నిందితుడు మహ్మద్ అమీర్​పై బాలిక కుటుంబ సభ్యులు పుల్వరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల నుంచి తమ కుమార్తె కనిపించట్లేదని పేర్కొన్నారు. నిందితుడు తమ కుమార్తె ప్రాణాలను తీసేస్తాడేమోనని భయంగా ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.