తమిళనాడులో ఎన్నికల వేళ భారీ స్థాయిలో అక్రమ బంగారం బయటపడుతోంది. తాజాగా కన్యాకుమారి ప్రాంతంలో 15.55 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇలా బయటపడింది..
తంజావూర్‌లోని ముత్తాళకురిచి ప్రాంతంలో అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. కేరళ రాష్ట్రం నుంచి నాగర్‌కోయిల్‌కు వెల్లే కేరళ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఓ వాహనాన్ని ఆపి సోదా చేశారు. ఈ నేపథ్యంలో అందులో 15కిలోల 55 గ్రాముల విలువైన బంగారం కడ్డీలు, ఆభరణాలను గుర్తించారు. సదరు వాహనదారుడు సరైన పత్రాలు చూపనందున.. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక తహసిల్దార్‌కు అప్పగించారు.
ఈ విషయమై డ్రైవర్ షిబు, సెక్యూరిటీ గార్డ్ ప్రదీప్ గోషిలపై విచారణ చేపట్టారు అధికారులు. అయితే.. కేరళ నుంచి నాగర్‌కోయిల్‌లోని భీమా జ్యువెల్లరీకీ తీసుకెళ్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇరు వర్గాల మధ్య 'డీజే' చిచ్చు-కర్రలు, రాళ్లతో దాడి