ETV Bharat / bharat

కల్తీ మద్యానికి 20 మంది బలి.. అసెంబ్లీలో దుమారం.. 'తాగి వచ్చారా?' అంటూ వారిపై సీఎం ఫైర్

బిహార్​లో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు. మరో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనపై రాష్ట్ర అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసింది. ఓ దశలో సీఎం నీతీశ్ కుమార్ సహనం కోల్పోయారు.

Deaths due to adulterated alcohol
కల్తీ మద్యం తాగి బీహార్​లో​ ఐదుగురు మృత్యువాత
author img

By

Published : Dec 14, 2022, 4:16 PM IST

Updated : Dec 14, 2022, 7:58 PM IST

కల్తీ మద్యం తాగి 20 మంది చనిపోయిన ఘటన బిహార్​లో రాజకీయ దుమారానికి దారితీసింది. మద్య నిషేదం ఉండగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంపై విపక్షాలు మండిపడ్డాయి. అసెంబ్లీలో దీనిపై దుమారం చెలరేగింది. ఓ దశలో సీఎం నీతీశ్ కుమార్ సహనం కోల్పోయారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సరన్ జిల్లా ఇషువాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. రాత్రి కొందరు వ్యక్తులు స్థానికంగా ఓ చోట మద్యం సేవించారు. అనంతరం ఇంటికొచ్చిన వారంతా తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. అందులో 20 మంది మరణించారు. మరికొంత మంది ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కల్తీ మద్యం తాగి చనిపోయినట్లుగానే అనుమాసిస్తున్నాం. ఆరుగురు మాత్రం ఖచ్చితంగా కల్తీ మద్యం తాగే చనిపోయిట్లుగా నిర్థారణ అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అసలు విషయాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు. కల్తీ మద్యానికి సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన..
ఘటనపై ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు అక్రమ మద్యం వ్యాపారుల మధ్య సంబంధం ఉందని వారు ఆరోపణలు గుప్పించారు. మరణాలకు ప్రభుత్వమే కారణమంటూ అసెంబ్లీ వెలుపల ఎమ్మెల్యేలంతా ఆందోళన చేపట్టారు. "మద్యపాన నిషేదానికి మా మద్దుతు ఎప్పుడు ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిషేదానికి మేం మద్దతు ఇచ్చాం. కానీ దాని అమలు పూర్తిగా విఫలమైంది" అని మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిశోర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

కాగా, ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్​ సింహ.. ప్రభుత్వాన్ని నిలదీయగా... సీఎం నీతీశ్ కుమార్ సహనం కోల్పోయారు. "మీరే తాగి వచ్చారు" అంటు విపక్షాలపై విరుచుకుపడ్డారు. "మీరు మద్య నిషేదానికి అనుకూలంగానే ఉన్నారా లేదా? మీ అందరికీ ఏమైంది? మీరంతా తాగుబోతులు అయ్యారా? వీటన్నింటినీ మేం సహించం" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం నీతీశ్.

లోక్​సభ ప్రస్తావన..
లోక్​సభ జీరో అవర్​లో ఈ విషాదాన్ని పలువురు ఎంపీలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఘటనపై మాట్లాడిన భాజపా ఎంపీ జనార్ధన్ సింగ్.. సరన్​ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశాడు. బిహార్‌లో రోజూ వందలాది మంది అక్రమ మద్యం తాగి మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రహదారిని నిర్భందించిన గ్రామస్థులు..
ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు రాష్ట్ర రహదారిని నిర్భందించారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందంటు రహదారినిపై బైటాయించారు. బాద్యులపై చర్యలు తీసుకుని, మృతుల కుటుంబాలకు పరిహారం చేల్లించాల్సిందిగా సర్కారును డిమాండ్​ చేస్తున్నారు.

Last Updated : Dec 14, 2022, 7:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.