ETV Bharat / bharat

మహిళా బైకర్​పై కాల్పులు.. తానూ షూట్ చేసుకుని పోలీస్​ ఆత్మహత్య - బంగాల్​లో కాల్పులు

Firing in Kolkata: మహిళా బైకర్​పై ఓ పోలీసు కాల్పులు జరపటం వల్ల ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆపై ఆ పోలీసు తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బంగాల్​లోని కోల్​కతాలో జరిగింది.

FIRING
మహిళా బైకర్​పై కాల్పులు
author img

By

Published : Jun 10, 2022, 3:37 PM IST

Updated : Jun 10, 2022, 3:54 PM IST

Firing in Kolkata: బంగాల్​ రాజధాని కోల్​కతాలో శుక్రవారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. రద్దీగా ఉండే పార్క్​ సర్కస్​ ప్రాంతంలోని బంగ్లాదేశ్​ డిప్యూటీ హైకమిషన్​ కార్యాలయం ముందు ఓ పోలీసు అధికారి.. ఓ మహిళపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళకు తుటాలు తగలగా.. అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. కాల్పుల్లో మరణించిన మహిళ, పోలీసు అధికారి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. 'దాదాపు ఐదు నిమిషాల పాటు పలు రౌండ్ల తూటాలు పేలాయి.' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. దీంతో హుటాహుటిన భారీగా బలగాలను తరలించారు అధికారులు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టానికి తరలించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి: పెళ్లికి నో చెప్పిందని 'వివాహిత'పై యాసిడ్​ దాడి

బ్రిడ్జ్​పై వేలాడుతూ.. కదులుతున్న ట్రైన్ నుంచి ఫోన్ చోరీ! షాకింగ్ వీడియో!!

Last Updated : Jun 10, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.