ETV Bharat / bharat

ఇంటర్​సిటీ ట్రైన్​కు తప్పిన పెను ముప్పు.. ఇంజిన్​లో మంటలు.. లోకోపైలట్ అప్రమత్తతతో.. - ఉద్యాన్ ఎక్స్​ప్రెస్​లో మంటలు

Fire In Khajuraho Udaipur Train Today : ఉద్యాన్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగిన ప్రమాదం మరవకముందే మరో ఘటన జరిగింది. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఖజురహో ఉదయ్​పుర్​ ఇంటర్​సిటీ రైలు ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్​ రైలును నిలిపివేయడం వల్ల ప్రయాణికులు కిందకు దిగి పరుగెత్తారు.

Fire In Khajuraho Udaipur Train Today
ఖజురహో ఉదయ్​పుర్​ ఇంటర్​సిటీ రైలులో మంటలు
author img

By

Published : Aug 19, 2023, 3:14 PM IST

Updated : Aug 19, 2023, 3:54 PM IST

Fire In Khajuraho Udaipur Train Today : మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఖజురహో ఉదయ్​పుర్​ ఇంటర్​సిటీ ట్రైన్​కు పెను ప్రమాదం తప్పింది. సితోలి రైల్వే స్టేషన్​కు చేరుకున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో మంటలు చెలరేగడం వల్ల అప్రమత్తమైన పైలట్​ రైలును ఆపివేశారు. భయాందోళనకు గరైన ప్రయాణికులు బోగీ దిగి పరుగెత్తారు. "ఇంజిన్​లో మంటలు చెలరేగగానే.. ఓవర్ హెడ్​ ఎక్విప్​మెంట్​ వ్యవస్థను పూర్తిగా ఆపివేశారు. ఆ తర్వాత రైలును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గురైన రైలు ఇంజిన్​ను తొలగించి.. మరొక ఇంజిన్​తో జత చేసి గమ్యస్థానానికి పంపిస్తాం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపుతున్నాం." అని ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్​ఓ హిమాన్షు శేఖర్​ ఉపాధ్యాయ్​ తెలిపారు.

  • VIDEO | A fire broke out in the engine of Khajuraho Udaipur intercity train near Gwalior. More details are awaited. pic.twitter.com/BkvDVmZOYq

    — Press Trust of India (@PTI_News) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైలులో మంటలు చెలరేగడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం. రైలును దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత ఇంజిన్​ను మార్చిన అనంతరం రైలు బయలుదేరుతుంది అని అధికారులు చెబుతున్నారు."

--ప్రయాణికుడు

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ఎక్స్​ప్రెస్​లో మంటలు..
Telangana Express Fire Accident Today : మరోవైపు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు సైతం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెత్తారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ..
Fire in Udyan Express Today : అంతకుముందు ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఓ రైలులో మంటలు చెలరేగాయి. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో.. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రయాణికులు రైలు నుంచి దిగిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

Train Caught Fire Today : "శనివారం ఉదయం 5:45 గంటలకు ఉద్యాన్​ ఎక్​ప్రెస్​ బెంగళూరు చేరుకుని ప్లాట్‌ఫామ్-3 వద్ద ఆగింది. సుమారు 7:10 గంటల ప్రాంతంలో రైలులోని B1, B2 కోచ్​లతో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నాం" అని బెంగళూరు రైల్వే అధికారులు తెలిపారు.

Fire In Express Train : ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్​లోనే..

Smoke in Sec-Guntur Intercity Express : సికింద్రాబాద్​-గుంటూర్​ ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Last Updated : Aug 19, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.