Father Slits Daughters Throats and Suicide : తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతుకోసి.. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. బాలికల అరుపులు విన్న స్థానికులు.. వెంటనే అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల జొమోన్.. పిల్లల గొంతుకోసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుల వయస్సు 13, 10, 7 సంవత్సరాలు ఉంటుంది. వారిలో చిన్న అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. జొమోన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
సంవత్సరన్న క్రితం జొమోన్ భార్య.. జొమోన్ను, పిల్లల్ని విడిచిపెట్టి పోయింది. అప్పటి నుంచి జొమోన్ సంరక్షణలో చిన్నారులు ఉంటున్నారు. అయితే ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. మద్యం మత్తులో నిందితుడు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమస్యలే దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
రక్తపు మడుగులో ట్రైనీ ఎయిర్ హోస్టెస్.. గొంతు కోసి మరీ దారుణం..
Air Hostess Murder in Mumbai : ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వెలుగులోకి వచ్చింది. అంధేరీలో ఉన్న ఓ ఫ్లాట్‌లో.. రక్తపు మడుగులో విగతజీవిగా ఎయిర్ హోస్టెస్ పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే (25)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాల్ ఓగ్రే (25) ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దీంతో శిక్షణ కోసం ఏప్రిల్ ఆమె ముంబయికి వచ్చారు. అంధేరీలోని ఓ హౌసింగ్ సొసైటీలో.. ఫ్లాట్ తీసుకుని తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్.. వారి గ్రామానికి వెళ్లారు. దీంతో రూపాల్ ఓగ్రే ఒక్కరే ఫ్లాట్‌లో ఉంటున్నారు.
కాగా ఆదివారం సాయంత్రం రూపాల్ కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.. ఆమె స్నేహితులకు కాల్ చేసి ఫ్లాట్‌కు వెళ్లి చూడాలని కోరారు. అనంతరం ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో రూపాల్ శవం పడి ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం అనుమానంతో హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న విక్రమ్ అత్వాల్(40)ను అరెస్ట్ చేశారు. ఘటనపై ప్రత్యేక బృందంగా ఏర్పడి మరి విచారణ చేస్తున్నారు పోలీసులు.
కొద్ది రోజుల క్రితం రూపాల్, విక్రమ్ అత్వాల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆధారాల కోసం హౌసింగ్ సొసైటీలోని కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. మరోవైపు విక్రమ్ అత్వాల్ భార్యను సైతం వారు విచారిస్తున్నారు. రూపాల్ ఓగ్రే గొంతుపై పదునైన ఆయుధంతో నిందితుడు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. రూపాల్ ఓగ్రేపై లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమికంగా వైద్యులు చెప్పలేదన్నారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Patient Treatment On Rickshaw Viral Video : రిక్షాపై ఆస్పత్రికి రోగి.. ఆరుబయటే వైద్యుడి చికిత్స..