ETV Bharat / bharat

లవ్​ మ్యారేజ్​ చేసుకుందని కూతురు దారుణ హత్య.. ఆమె ఫ్లాట్​కు వెళ్లి.. గొంతు నులిమి.. - haryana honor killing

Father Kills Daughter Honor Killing : ప్రేమ వివాహం చేసుకుందని.. కన్నకూతురిని తండ్రే దారుణంగా చంపేశాడు. ఆమె నివసిస్తున్న ఫ్లాట్​కు వెళ్లి మరీ గొంతు నులిమి హత్య చేశాడు. హరియాణాలో జరిగిందీ ఘటన.

Father Kills Daughter Honor Killing
Father Kills Daughter Honor Killing
author img

By

Published : Aug 19, 2023, 8:36 AM IST

Father Kills Daughter Honor Killing : హరియాణాలోని గురుగ్రామ్​లో పరువు హత్య కలకలం రేపింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతోనే.. కన్నతండ్రే గొంతు నులిమి హతమార్చాడు. అందుకు ఆమె తల్లి, సోదరుడు కూడా సహకరించారు. ఆ తర్వాత అంతా కలిపి ఆమె మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. మృతురాలిని 22 ఏళ్ల అంజలిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్​లోని సెక్టార్​- 102లో బాధితురాలు అంజలి తన భర్త సందీప్​తో కలిసి నివాసం ఉంటోంది. అయితే ఆగస్టు 17వ తేదీ ఉదయం అంజలి భర్త సందీప్.. తన సోదరికి తీజ్ పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చేందుకు రోహ్​తక్​కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అంజలి సోదరుడు కునాల్.. ఆమె ఇంటికి చేరుకున్నాడు.

ఆ తర్వాత తన తండ్రి కుల్దీప్, తల్లి రింకీకి ఫోన్​ చేసి అంజలి ఇంటికి రప్పించాడు. అనంతరం ఒక్కసారిగా అంజలిని ఆమె తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. అందుకు బాధితురాలు తల్లి, సోదరుడు సహకరించారు. తనను చంపవద్దని అంజలి ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా చంపేశారు. స్థానికంగా ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​లో పనిచేస్తున్న కుల్దీప్​.. ఓ కారులో అంజలి మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో రహస్యంగా దహనం చేసేశారు.

Honor Killing Haryana : అంజలి హత్య గురించి విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే అంజలి మృతదేహం పూర్తి కాలిపోయిందని ఏసీపీ వరుణ్​ దహియా తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించనుందని చెప్పారు. ఈ పరువు హత్య కేసు గురించి అంజలి భర్త సందీప్‌కు అతడి స్నేహితుడి ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. దీంతో సందీప్.. వెంటనే గురుగ్రామ్​కు వచ్చి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అంజలి హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్​ 19వ తేదీన ఓ ఆలయంలో బాధితురాలు.. అదే గ్రామానికి చెందిన సందీప్​తో ప్రేమ​ వివాహం చేసుకుందని పోలీసులు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.