ETV Bharat / bharat

ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి - అత్యాచారం

father killed and throws child: అంభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను ఓ తండ్రి అతికిరాతకంగా చంపి బావిలో పడేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో 30 ఏళ్ల మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

father killed and throws child
ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి
author img

By

Published : May 1, 2022, 1:21 PM IST

father killed and throws child: ఒడిశా సుందర్​గఢ్​ జిల్లాలో హృదవిదారక ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడిగా మారాడు. అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేశాడు. జిల్లాలోని కోయిడా పోలీస్​ స్టేషన్​ పరిధి, కులు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడిని పాండు ముందాగా గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండు శనివారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్య ధుబలి ముందాతో గొడవకు దిగాడు. ఆగ్రహంతో గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించగా ఆమె ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. దీంతో ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల కూతురు సీమా, రెండేళ్ల కుమారుడు రాజు, మూడు నెలల పాపను చంపాడు. వీరి మృతదేహాలను ఇంటి సమీపంలోని బావిలో పడేసి పారిపోయాడు. ఆదివారం ఉదయం పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బావి నుంచి తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడు పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.

father killed and throws child
ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి

చితికి నిప్పంటిస్తుండగా పేలిన కిరోసిన్ క్యాన్​: అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కిరోసిన్​ క్యాన్​ పేలిపోయి 11 మంది గాయపడిన సంఘటన మహారాష్ట్రలోని పుణెలో శనివారం జరిగింది. ముంధ్వా ప్రాంతానికి చెందిన దీపక్​ ప్రకాశ్​ కాంబ్లే(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి అంత్యక్రియల్లో చితిపై ఓ వ్యక్తి కిరోసిన్​ చల్లుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి పేలిపోయింది. గాయపడిన వారిని సస్సూన్​ ఆసుపత్రికి తరలించారు. వారందరికి 30-35 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్​ఐ హరీశ్​ ఠాకుర్​ తెలిపారు.

30ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం: ఓ 30 ఏళ్ల మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్​ 22న ఐదుగురు దుండగులు ఇంట్లోకి చొరబాడి మహిళను ఇంటి ముందు ఉన్న గుడిసెలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్​పీ సంజయ్​ కుమార్​ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు

జాబ్​లో చేరిన తర్వాతి రోజే నర్సుకు 'ఉరి'.. ఆస్పత్రిలోనే గ్యాంగ్​రేప్, హత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.