ETV Bharat / bharat

రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. వెళ్లే దారి లేక.. - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంది ఓ కుటుంబం. శ్మశాన వాటికకు వెళ్లాల్సిన దారిలో వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల అంత్యక్రియలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

dead body kept in home
dead body kept in home
author img

By

Published : Sep 7, 2022, 8:11 PM IST

Updated : Sep 7, 2022, 8:25 PM IST

కర్ణాటకలో హృదయ విదారక ఘటన జరిగింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని రెండు రోజుల పాటు ఉంది ఓ కుటుంబం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్మశాన వాటికకు వెళ్లాల్సిన దారి వరద ప్రవాహంతో మూసుకుపోయింది.

చిక్కమగళూరులోని బొమ్మనహల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల ప్రమోద్​ అనారోగ్యంతో ఆదివారం మరణించాడు. కానీ కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుడండం వల్ల అంత్యక్రియలకు సమస్యగా మారింది. ఈ వరదలతో శ్మశాన వాటికకు వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోవడం వల్ల మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి అడ్డంకిగా మారింది. భారీ వర్షాల కారణంగా చాలా ఏళ్ల తర్వాత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు.

dead body kept in home
మృతదేహంతో వాగు దాటుతున్న కుటుంబ సభ్యులు
dead body kept in home
మృతదేహంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు

వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యిని తవ్వేందుకు జేసీబీని తీసుకువచ్చారు. కానీ ఆ వాహనం కూడా బురదలో ఇరుక్కుపోవడం వల్ల గంటపాటు ఆలస్యం అయ్యింది. ఈ వాగు సమస్య ఈనాటిది కాదని.. గత 10 సంవత్సరాలుగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

dead body kept in home
అంత్యక్రియలకు వెళ్లేందుకు వాగు దాటుతున్న గ్రామస్థులు

ఇవీ చదవండి: 'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్​ అధ్యక్షుడైతేనే సాధ్యం'

ఇద్దరు యువకులపై 20మంది ఆర్మీ అభ్యర్థుల మూక దాడి.. కర్రలతో కొట్టి.. రాళ్లు రువ్వి..

Last Updated : Sep 7, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.