Adulterated liquor in Ujjain: మద్యం కల్తీపై ఓ మందుబాబు ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన లిక్కర్ కిక్కు ఇవ్వలేదని, కల్తీ జరిగిందని తన ఆవేదనను ఫిర్యాదులో వెల్లబుచ్చాడు. కల్తీకి పాల్పడుతున్న దుకాణంపై చర్యలు తీసుకోండంటూ.. హోంమంత్రితో పాటు అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న అబ్కారీ శాఖ కమిషనర్.. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ జరిగింది: ఉజ్జయిన్‌లోని బహదుర్ గంజ్‌కు చెందిన లోకేశ్ సోథియా ఏప్రిల్ 12న నగరంలోని ఓ మద్యం దుకాణంలో నాలుగు క్వార్టర్ బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాలు ఖాళీ చేశాడు. బాటిల్ మూత తీసినప్పుడు మద్యం వాసన రాకపోవటం, రెండు సీసాలు ఖాళీ అయినా కిక్కు ఎక్కకపోవటం వల్ల కల్తీ జరిగినట్లు భావించాడు. 'మరో రెండు బాటిళ్లను సీల్ తీయకుండా నా వద్దే ఉంచుకున్నా. అవసరమైనప్పుడు ఆధారాలుగా వాటిని అందిస్తాను. ఆహారం, నూనెలు, ఇతర వస్తువుల్లో కల్తీ జరుగుతోందని వార్తలు వింటున్నాం. ఇప్పుడు లిక్కర్‌లోనూ చేస్తున్నారు. అది చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేస్తాను. నేను రెండు దశాబ్దాలుగా మద్యం తాగుతున్నా.. దాని స్వచ్ఛత, రుచి నాకు తెలుసు.' అని పేర్కొన్నాడు సోథియా.
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, ఉజ్జయిన్ అబ్కారీ శాఖ కమిషనర్ ఇందెర్ సింగ్ దమోర్‌కు.. లిక్కర్ కల్తీపై ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు సోథియా. మరోవైపు.. వినియోగదారుల ఫోరమ్‌లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సోథియా న్యాయవాది నరేంద్ర సింగ్ ధక్డే తెలిపారు. ' నా క్లయింట్ పెయిడ్ పార్కింగ్ నడుపుతున్నారు. చాలా ఏళ్లుగా మద్యం సేవిస్తున్నారు. ఆయనకు ఏది నకిలీ, ఏది నిజమైనది అనే తేడా తెలుసు' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కారులోని సోదరులపై తూటాల వర్షం.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే..
పరీక్ష రాసి వస్తుండగా 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. రెండ్రోజుల పాటు గ్యాంగ్ రేప్