Ex-Bureaucrats Letter to PM: దేశంలోని విద్వేష రాజకీయాలకు బాధ్యుడ్ని చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ సివిల్ సర్వెంట్లు లేఖ రాయడాన్ని పూర్వ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు తప్పుపట్టారు. ప్రజలు మోదీ పక్షాన ఉండటం చూసి ఓర్వలేకే వారు ఆ లేఖ రాసినట్లు ఆరోపించారు. ఈ మేరకు ప్రధానికి మరో లేఖ రాసిన మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు సైన్యాధికారులు, మాజీ ఐఏఎస్ల రాతల్లో ఎలాంటి వాస్తవం లేదని తోసిపుచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా విజయాన్ని ఓర్వలేకే వారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడ్డారు.
లేఖ రాసిన వారి కోపం, వేదన శూన్యమన్న మాజీ న్యాయమూర్తుల బృందం తప్పుడు చిత్రీకరణలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీకి లేఖ రాసిన వారిలో 8 మంది మాజీ న్యాయమూర్తులతో పాటు 97 మంది మాజీ ఐఏఎస్లు, 92 మంది రిటైర్డ్ సైన్యాధికారులు ఉన్నారు. అంతకుముందు ప్రధానికి 108 మంది మాజీ ఐఏఎస్ల బృందం లేఖ రాసింది. భాజపా పాలిత రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విద్వేష రాజకీయాలకు స్వస్తిపలకాలని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల్లోని మైనారిటీలపై జరుగుతున్న ఉన్మాద దాడులను లేఖలో ప్రస్తావించింది.
ఇదీ చూడండి : సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!