ETV Bharat / bharat

ఇద్దరు ఉద్యోగస్థులను కిడ్నాప్ చేసిన నక్సలైట్లు - ఛత్తీస్​గఢ్ కిడ్నాప్ న్యూస్

ప్రధానమంత్రి గ్రామ్​సడక్ యోజన కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన వీరిని నక్సలైట్లు కిడ్నాప్​ చేశారు. అందులో ఒకరిని విడిచిపెట్టారు.

naxals
నక్సలైట్లు
author img

By

Published : Nov 13, 2021, 1:51 AM IST

Updated : Nov 13, 2021, 10:38 AM IST

ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను నక్సలైట్లు కిడ్నాప్​ చేశారు.

ఇదీ జరిగింది..

అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద సబ్​ఇంజినీర్, అటెండర్​గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అటెండర్​ విడుదల..

ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోలు.. అందులో అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

రెచ్చిపోయిన మావోలు.. ఐదుగురు గ్రామస్థుల కిడ్నాప్

Last Updated : Nov 13, 2021, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.