ETV Bharat / bharat

గవర్న్​మెంట్​ జాబ్ కావాలా? వేల పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్- అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 12:42 PM IST

Employment News December 2023 In Telugu : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.​ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐబీ, ఎన్​ఐవోఎస్​, హిందూస్థాన్​ షిప్​యార్డ్​ సహా, పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వాటి పూర్తి వివరాలు మీ కోసం..

List Of Government Jobs in December 2023
Employment news December 2023

Employment News December 2023 : ఈ డిసెంబర్​ నెలలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్​ విడుదల చేశాయి. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయా నోటిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Of Baroda Senior Manager Recruitment 2023 : బ్యాంక్ ఆఫ్ బరోడా 250 సీనియర్​ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • విద్యార్హతలు : డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంబీఏ (మార్కెటింగ్​ & ఫైనాన్స్​) చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులే.
  • వయోపరిమతి : అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు నుంచి 37 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ఎంపిక విధానం : అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత సైకోమెట్రీ టెస్ట్​ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారిని సీనియర్ మేనేజర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్​ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను వీక్షించండి.
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 26

IB ACIO Recruitment 2023 : మినిస్ట్రీ ఆఫ్​ హోమ్​ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 995 అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ - గ్రేడ్ II ఎగ్జిక్యూటివ్​ పోస్టులు - 995
  • విద్యార్హతలు : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి.
  • వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • అప్లికేషన్​ ఫీజు : అభ్యర్థులు అందరూ రిక్రూట్​మెంట్​ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. దీనికి తోడు జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ (పురుషులు) అప్లికేషన్​ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు ముందుగా టైర్​-1, టైర్​-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్​ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
  • జీతభత్యాలు : అసిస్టెంట్ సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు.
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 15

NIOS Recruitment 2023 : నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్​లోని.. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగంలో గ్రూప్​ A,B,C పోస్టుల భర్తీ కోసం విద్యా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • ఉద్యోగాల వివరాలు : ఈ రిక్రూట్​మెంట్ ద్వారా మల్టీ-టాస్కింగ్ స్టాఫ్​, జూనియర్ అసిస్టెంట్​​, స్టెనోగ్రాఫర్, పబ్లిక్ రిలేషన్​ ఆఫీసర్​, ఎడ్యుకేషనల్ ఆఫీసర్​, అసిస్టెంట్ డైరెక్టర్​​ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 62.
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్​ 21లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Hindustan Shipyard Limited Recruitment 2023 : హిందూస్థాన్ షిప్​యార్డ్ లిమిటెడ్​.. మేనేజర్స్​, కన్సల్టెంట్స్​, ప్రోజెక్ట్​ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 99. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్​ 24లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాల వివరాల కోసం ఈ లింక్​లను క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.