తమిళనాడు దిండిగల్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చెరకు కర్ర కోసం రెండు గజరాజుల మధ్య భీకర పోరే కారణం. హసనూర్ సమీపంలోని సత్యమంగళం అటవీ ప్రాంతం సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
చెరకు లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్.. రోడ్డుపక్కన రెండు ఏనుగులను చూసి వాహనాన్ని ఆపాడు. వెంటనే అక్కడ ఉన్న ఆడ ఏనుగు లారీ నుంచి చెరకు తీసి.. తన పిల్ల ఏనుగుకు అందించింది. కొద్దిసేపట్లోనే అక్కడికి మరో ఏనుగు వచ్చింది. అంతే.. రెండు ఏనుగుల మధ్య యుద్ధం మొదలైంది. చెరకు కోసం రెండూ కొట్టుకున్నాయి. తొండాలతో ఒకదానిపై మరొకటి కలబడ్డాయి.
ఈ దృశ్యాన్ని చూసేందుకు.. ఆ దారి గుండా వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేశారు. ఇలా దాదాపు 25 నిమిషాల సేపు ఏనుగులు ఫైట్ చేయగా.. ట్రాఫిక్ స్తంభించింది. ఆ తర్వాత తలోదారిన వెళ్లిపోయాయి.
ఇదీ చూడండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం ఐపీఎస్ అధికారి అవతారం.. చివరకు...