ETV Bharat / bharat

Delhi Excise Case :​ సిసోదియాకు ఈడీ షాక్​.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్​! - దిల్లీ మద్యం కేసులో నిందితుల ఆస్తులు అటాచ్

Delhi Excise Case ED : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దీల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాతో పాటు ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. మరో రూ.7.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్​ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi Excise Case ED
Delhi Excise Case ED
author img

By

Published : Jul 7, 2023, 7:42 PM IST

Updated : Jul 7, 2023, 8:15 PM IST

Delhi Liquor Case ED : దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్​ అయిన​ ఆమ్​ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా, ఆయన భార్య సీమ సిసోదియాతో పాటు ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. ఈ మేరకు ఈడీ శుక్రవారం వివరాలు వెల్లడించింది.

ఈడీ అటాచ్​ చేసిన మొత్తంలో రూ.11.49 కోట్ల మనీశ్​ సిసోదియాకు చెందిన బ్యాంకు బ్యాలెన్సులు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెట్​కు చెందిన రూ. 16.45 కోట్లతో పాటు ఇతరత్రా కలిపి రూ.44.29 కోట్ల చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు కలిపి అటాచ్​ చేసిన మొత్తం విలువ రూ. 52.24 కోట్లకు చేరిందని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.

దీంతోపాటు మనీలాండరింగ్​ చట్టం కింద మరో రూ. 7.29 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్​ చేయడానికి ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీశ్​ సిసోదియా, ఆయన భార్య సీమ సిసోదియాకు చెందిన రెండు స్థిరాస్తులు, మరో నిందితుడు రాజేశ్​ జోషికి చెందిన ల్యాండ్​/ఫ్లాట్​, గౌతమ్​ మల్హోత్రాకు చెందిన ల్యాండ్​/ ఫ్లాట్​ ఉన్నాయి. దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో మనీలాండరింగ్​ జరిగిందన్న ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. మార్చిలో మనీశ్​ సిసోదియాను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్​ కస్టడీలో ఉన్నారు.

ఇదీ దిల్లీ మద్యం కుంభకోణం కేసు..
దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో అనేక లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఇందుకు ప్రధాన కారణం. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఈ నూతన మద్యం విధానం తయారు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే విషయమై దిల్లీ ప్రధాన కార్యదర్శి ఓ నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్ మంత్రిగా మనీశ్​ సిసోదియా ఉన్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ వీకే సిఫార్సుతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా సహా మరికొందరు పేర్లను నిందితులుగా పేర్కొంటూ 2022 ఆగస్టు 17న ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. అందులో సిసోదియా ఒకరు.

Last Updated : Jul 7, 2023, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.