ETV Bharat / bharat

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతి - గుండెపోటుతో అభిజిత్ సేన్ మృతి

Economist Abhijit Sen died ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ మరణించారు. గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించినట్లు అభిసేన్​ సేన్​ సోదరుడు ప్రణబ్ సేన్ తెలిపారు.

Abhijit Sen dead
అభిజిత్ సేన్
author img

By

Published : Aug 30, 2022, 7:26 AM IST

Economist Abhijit Sen died: గుండెపోటుతో ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్(72) మరణించినట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్​కు గుండెపోటు వచ్చిందని.. వెంటనే దిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకునేలోపే అభిజిత్ సేన్​ ప్రాణాలు కోల్పోయారని ప్రణబ్ వెల్లడించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారు. వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్​గా వ్యవహరించారు. దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్​గా పనిచేశారు. ఆయనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టుంది.

ఇవీ చదవండి: చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

రిలయన్స్ విస్తరణ, భారీగా కొత్త పెట్టుబడులు, వారసులకు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.