దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలు రాగానే.. స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు రిషికేశ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.
అయితే నేపాల్‌లో సంభవించిన భూకంపం ధాటికి దిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భుకంపం ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌కు ఆగ్నేయంగా 212 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని సమాచారం. ఈ ప్రభావానికి ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్, మున్సియరీ, గంగోలిహాట్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మూడురోజుల క్రితం నేపాల్‌లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. ఆ సమయంలో నేపాల్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: