ETV Bharat / bharat

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: మోదీ - మోదీ రాజ్యాంగ దినోత్సవం

వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని1950 తర్వాత ప్రతి ఏటా నిర్వహించాల్సిందని పేర్కొన్నారు. కానీ కొంతమంది అలా చేయలేదని చెప్పారు(PM Modi News).

రాజ్యాంగ దినోత్సవం, Constitution Day
రాజ్యాంగ దినోత్సవం
author img

By

Published : Nov 26, 2021, 12:00 PM IST

Updated : Nov 26, 2021, 1:55 PM IST

రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రజలకు వారసత్య రాజకీయాల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. కాంగ్రెస్​పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్​లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని(PM Modi News).

"రాజకీయ పార్టీలు విలువలు కోల్పోయినప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రజలకు వారసత్వ పార్టీలు ఆందోళనకరం. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయో చూడండి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఒక పార్టీని ఓకే కుటుంబం తరతరాలుగా నడిపించడం, పార్టీ వ్యవస్థ మొత్తం కుటుంబానికే పరిమితం కావడం ప్రజాస్వామ్యానికి అతి పెద్ద సమస్య."

-ప్రధాని మోదీ

1950 తర్వాత ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సిందని మోదీ అన్నారు. ఎందుకు దీన్ని రూపొందించారో అందరికీ తెలియజేయాల్సిందన్నారు. కానీ కొంతమంది అలా చేయలేదని చెప్పారు. మనం చేసే పని సరైనదా? కాదా? అని విశ్లేషించుకోవడానికి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరపాలని సూచించారు. ఎంతో మంది మేధావులు తమ మెదడుకు పదునుపెట్టి, అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు(modi constitution).

Constitution Day is celebrated in the Central Hall of the Parliament
రాజ్యాంగ దినోత్సవం

2008లో ముంబయిలో ఉగ్రవాదుల మారణ హోమం కూడా (26/11) ఇదే రోజు జరిగిందని మోదీ గుర్తు చేశారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించారు(modi constitution day speech).

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగాంగానే పార్లమెంటు సెంట్రల్​ హాల్​లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు(constitution day 2021).

విపక్షాలు దూరం..

రాజ్యాంగ దినోత్సవాన్ని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించి కాంగ్రెస్ సహా 14 పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీఎంకే, శివసేన, ఎన్‌.సి.పి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కేంద్ర ప్రభుత్వం తరచూ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. అందుకే కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు చెప్పాయి.

ఇదీ చదవండి: Constitution Day 2021: 'ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శకం'

Last Updated : Nov 26, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.