ETV Bharat / bharat

నుపుర్​ శర్మకు 'మహా' పోలీసుల సమన్లు- దిల్లీ పోలీసుల భద్రత - నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు

Nupur Sharma Controversy: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకురాలు నుపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీచేశారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని సూచించారు.

nupur sharma
నుపుర్ శర్మ
author img

By

Published : Jun 7, 2022, 3:15 PM IST

Updated : Jun 7, 2022, 4:00 PM IST

Nupur Sharma Controversy: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో దుమారానికి కారణమైన భాజపా నేత నుపుర్‌ శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. జూన్ 22న ఠాణేలోని ముంబ్రా పోలీస్​ స్టేషన్​లో విచారణ అధికారి ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్​పై నమోదైన కేసు ఆధారంగా ఈ సమన్లు జారీ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. నుపుర్ శర్మపై నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలను పేర్కొంటూ పోలీసులు.. ఈ-మెయిల్‌తో పాటు స్పీడ్ పోస్ట్ ద్వారా సమన్లు ​​పంపినట్లు అధికారులు తెలిపారు.

మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అనేక ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో భాజపా.. నుపుర్ శర్మను ఆదివారం సస్పెండ్ చేసింది. టీవీ న్యూస్ డిబేట్​లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ముంబయి పోలీసులు మే 28న నుపుర్ శర్మపై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. ముంబయిలోని పిదోనీ పోలీసులు కూడా నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. తనకు ప్రాణహాని ఉందని నుపుర్ శర్మ.. దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు నుపుర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు.

ఇవీ చదవండి: భాజపా నేతల వ్యాఖ్యలతో చిక్కులు.. భారత దౌత్య సమర్థతకు అగ్ని పరీక్ష

సిద్ధూ కుటుంబానికి రాహుల్​ పరామర్శ.. పంజాబ్​ లాయర్ల కీలక నిర్ణయం!

Last Updated : Jun 7, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.