ETV Bharat / bharat

'దిల్లీ ఆర్డినెన్స్​కు మద్దతు ఇవ్వబోం'.. విపక్షాల భేటీకి ముందు కాంగ్రెస్ క్లారిటీ - కాంగ్రెస్ దిల్లీ ఆర్డినెన్స్

Delhi Ordinance Congress : దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. విపక్షాల భేటీకి ముందు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇది జరిగిన కాసేపటికే.. బెంగళూరులో జరిగే సమావేశానికి హాజరవుతున్నట్లు ఆప్ ప్రకటించింది.

delhi ordinance Congress
delhi ordinance Congress
author img

By

Published : Jul 16, 2023, 4:38 PM IST

Updated : Jul 16, 2023, 5:27 PM IST

Delhi Ordinance Congress : దిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దేశంలో సమాఖ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల జోక్యం ద్వారా.. కేంద్రం చేసే ఏ చర్యలనైనా వ్యతిరేకిస్తామని హస్తం పార్టీ వెల్లడించింది. ఈ బిల్లు పార్లమెంట్​ ముందుకు ఎప్పుడు వచ్చినా.. వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు వేణుగోపాల్​. తాము ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని తెలిపారు. విపక్షాల భేటీకి ముందు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది కాంగ్రెస్.

Opposition Meeting In Bengaluru : ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది సానుకూల పరిణామమని అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ నిర్ణయం ప్రకటించిన కాసేపటికే బెంగళూరులో జరిగే సమావేశానికి హాజరవుతామని తెలిపింది ఆప్​. ఈ సమావేశానికి కేజ్రీవాల్​తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్​ వెళ్లనున్నారని చెప్పింది. ఈ విషయమై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ.. ఆదివారం ఆయన నివాసంలో సమావేశమై నిర్ణయం తీసుకుంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ సమావేశమవుతున్నాయి. ఇప్పటికే పట్నాలో ఒకసారి భేటీ అయిన నేతలు.. 17, 18వ తేదీల్లో బెంగళూరులో మరోసారి సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం పలుకుతూ బెంగళూరులో పోస్టర్లు ఏర్పాటు చేశారు.

  • #WATCH | Posters of opposition leaders including Delhi CM Arvind Kejriwal put up in Bengaluru ahead of the opposition meeting.

    Congress today announced that it will support AAP on the ordinance issue. pic.twitter.com/HRR4OdgkFG

    — ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Ordinance Row : గత కొన్ని రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ బహిరంగంగా వ్యతిరేకించాలని 'ఆప్‌' డిమాండ్‌ చేస్తోంది. తన నిర్ణయాన్ని తెలపాలంటూ పట్నాలో జరిగిన విపక్షాల భేటీకి ముందు అల్టిమేటం కూడా జారీ చేసింది. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేసే వరకు భవిష్యత్తులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశాలకు హాజరయ్యేదే లేదని ఆప్‌ తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తదుపరి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. తాజాగా దిల్లీ ఆర్డినెన్స్​కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఇదీ ఆర్డినెన్స్​
Delhi Ordinance Issue : దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీం కోర్టు దిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో.. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోన్న దిల్లీ ప్రభుత్వం.. దీన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇవీ చదవండి : 'ఇప్పుడు దిల్లీలో.. రేపు దేశమంతటా ఆర్డినెన్స్​'.. కేంద్రం​పై కేజ్రీవాల్ ఫైర్

విపక్షాల భేటీకి అంతా రెడీ.. కేజ్రీవాల్ అలక.. మమతది మరోదారి.. ఇద్దరికీ చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహం!

Last Updated : Jul 16, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.