ETV Bharat / bharat

పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిపై అత్యాచారం.. మూడుసార్లు అబార్షన్! - పెళ్లికొడుకు చదువుకోలేదని పెళ్లి నిరాకరించిన వధువు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భవతి అయ్యింది. అబార్షన్​ చేసుకోమని బాధితురాలిని ఒత్తిడి చేశాడు నిందితుడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది. మరోవైపు, తనకు చెప్పకుండా భార్య పుట్టింటికి వెళ్లిందని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. తన జననాంగాలను కోసుకున్నాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

girlfriend rape
ప్రియురాలిపై అత్యాచారం
author img

By

Published : Jan 21, 2023, 5:17 PM IST

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భవతి అయ్యింది. అబార్షన్ చేయించుకోమని బాధితురాలిని ఆమె ప్రియుడు, అతడి తండ్రి, సోదరుడు ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​లో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దిల్లీకి చెందిన ఓ యువతి.. ఉత్తరాఖండ్​కు చెందిన నౌషాద్ ఖురేషీ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఏడాదిన్నరగా కలిసి జీవిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని నమ్మించి నౌషాద్​ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రెండు సార్లు గర్భవతి అవ్వగా.. అబార్షన్​ చేయించాడు నిందితుడు. మూడో సారి కూడా బాధితురాలు గర్భవతి కావడం వల్ల అబార్షన్ చేసుకోమని ఒత్తిడి చేశాడు. అంతేగాక నిందితుడి తండ్రి, సోదరుడు.. మతం మారాలని యువతిని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు నౌషాద్ ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు. అతడి తండ్రి షానవాజ్​, జహీర్ ఖురేషీని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

భార్య చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని..
బిహార్​ మాధేపురాలో దారుణం జరిగింది. తన భార్య చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి తన జననాంగాలను పదునైన ఆయుధంతో కోసుకున్నాడు. అనంతరం నొప్పితో అరవడం మొదలుపెట్టాడు. స్థానికులు అతడి ఇంటికి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం పట్నాలోని ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. బాధితుడు కృష్ణ.. పంజాబ్​లోని ధాన్యం మార్కెట్లో పనిచేస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడని పేర్కొన్నారు.

సవతి తల్లి చేతిలో బాలిక..
ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో దారుణం జరిగింది. సవతి తల్లి ఏడేళ్ల బాలికను హత్య చేసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలి తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆమె తండ్రి ఘనశ్యామ్​.. భారతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుమారులు కంటే ఘనశ్యామ్​.. కుమార్తెను బాగా చూసుకుంటున్నాడనే అసూయతో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసింది.

చదువుకోలేదని పెళ్లికి 'నో'..
పెళ్లి కుమారుడు నిరక్షరాస్యుడని ఓ వధువు అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో వెలుగుచూసింది. వరుడుకి వధువు సోదరుడు డబ్బులు లెక్కించమని ఇచ్చాడు. వరుడు డబ్బులు లెక్కించలేకపోయాడు. ఈ విషయం వధువుకు తెలిసింది. దీంతో అతడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. దీనిపై ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. చివరకు ఈ విషయం పోలీసులకు దృష్టికి చేరింది. ఇరువర్గాలు పోలీసులు స్టేషన్​కు చేరుకున్నాయి. ఇరుకుటుంబాల మధ్య సయోద్య కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. వరుడి కుటుంబం వెంటనే తమ స్వగ్రామానికి వెళ్లిపోయింది.

షాపు యజమాని మర్డర్​కు యత్నం..
ఓ షాపు యజమానిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు. నిందితుడు జగదీశ్​ పర్మార్​గా దోషిగా పేర్కొన్నారు అహ్మదాబాద్ అదనపు సెషన్స్ జడ్డి సర్గ వ్యాస్​. ఓ పరికరం ఇవ్వలేదని షాపు యజమాని అనిల్ రామ్‌తేజ్ చవార్సియా తలపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు నిందితుడు. అతడి నేరం రుజువైందని.. ఇలాంటి నేరాన్ని తేలికగా తీసుకోలేమని వ్యాస్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.