Dead Rat in patients food: ఝార్ఖండ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి అడ్డాలుగా మారిపోతున్నాయి. రోగులకు అందించిన ఆహారంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ ఘటన మానసిక రోగులకు చికిత్స అందించే రిన్పస్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనిపై ఆస్పత్రి డైరెక్టర్ జయతి సిమ్లయిని సంప్రదించగా.. దీనికి కారకులైన వారిని గుర్తించామని.. కంకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆస్పత్రి పేరును చెడగొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు సైబర్ పోలీసులకు సైతం సమాచారం అందించామని పేర్కొన్నారు.
రిన్పస్ ఆస్పత్రి మానసిక రోగులకు చికిత్సను అందిస్తోంది. ఇలాంటి రోగులకు సరైన ఆహారం అందించాల్సి ఉంటుంది. మానసిక రోగులకు అందించే ఆహారంలో చనిపోయిన ఎలుక రావడం పట్ల రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల ఆరోగ్యం పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్.. ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్
కడుపులో స్టీల్ గ్లాస్.. గంటసేపు వైద్యుల సర్జరీ.. అంత పెద్దది లోపలికెలా వెళ్లిందో!