అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు జరుగుతున్న సమయంలోనే మజర్-ఎ-షరీఫ్ నగరం నుంచి సుమారు 50 మంది భారత కాన్సులేట్ అధికారులను స్వదేశానికి తరలించింది భారత వాయుసేన. ఇది జరిగిన రెండు రోజులకే ఆ నగరాన్ని ఆక్రమించారు తాలిబన్లు.
అఫ్గాన్‌లోని భారత కాన్సులేట్ సహా ఐటీబీపీ అధికారులను ఈ నెల 11, 12 తేదీల్లో వాయుసేన ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాందహార్‌లోని కాన్సులేట్ సిబ్బందిని కూడా ఆ నగరాన్ని ముష్కరమూకలు ముట్టడించడానికి ముందే కాబుల్ రాయబార కార్యాలయానికి తరలించింది కేంద్ర ప్రభుత్వం. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత సుమారు 180 మంది అధికారులను భారత్‌కు రప్పించింది.
ఇప్పటికీ అఫ్గాన్‌లో చిక్కుకుపోయి ఉన్న భారత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత వాయుసేన, వాణిజ్య విమానాలు వేచిచూస్తున్నాయి. కాబుల్‌లో మన విమానాల ల్యాండింగ్ కోసం స్థానిక అధికారులు, అమెరికా భద్రత దళాల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇదీ చూడండి: కాబుల్ నుంచి స్వదేశానికి భారతీయులు- ఎంబసీ సేవలు యథాతథం!