ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఏడుగురు వ్యక్తులు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కొత్వాలి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే: గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు నిందితులు. తుపాకీతో బెదిరించి మహిళను వివస్త్రను చేశారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శనివారం సాయంత్రం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుజ్, కుల్దీప్, అంకిత్ , రవి, రిజ్వాన్, చోటా, అబ్దుల్‌ను నిందితులుగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: 'నాకింకా పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి'.. పాటలు పాడుతూ ఎంపీ రిక్వెస్ట్