భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 38,948 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 219 మంది మరణించారు. కొత్తగా 43,903 మంది కరోనాను జయించారు. గత ఐదున్నర నెలల్లో ఇంత తక్కువగా మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.
- మొత్తం కేసులు: 3,30,27,621
- మొత్తం మరణాలు: 4,40,752
- కోలుకున్నవారు: 3,21,81,995
- యాక్టివ్ కేసులు: 4,04,874
కొవిడ్ పరీక్షలు..
ఆదివారం ఒక్కరోజే దేశంలో 14,10,649 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 53,14,68,867కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 68,75,41,762 మందికి కొవిడ్ వ్యాక్సిన్ను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొనసాగుతున్న విలయం..
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,26,871 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 6,654 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,15,56,009కి చేరగా.. మరణాల సంఖ్య 45,81,930కు పెరిగింది.
వివిధ దేశాల్లో..
- అమెరికా- 35,586
- బ్రిటన్- 37,011
- రష్యా- 18,645
- బ్రెజిల్- 12,915
- ఫ్రాన్స్-10,410
ఇవీ చదవండి: