ETV Bharat / bharat

'లాయర్లు సమాజానికి దిక్సూచి కావాలి' - సుప్రీంకోర్టు న్యూస్​

న్యాయవాదులు సమాజానికి దిక్సూచిగా నిలవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణ అన్నారు. అవసరమైన వారికి సాయం చేస్తూ ప్రజలకున్న హక్కుల పట్ల చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. బార్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దిల్లీలో సీజేఐ రమణను ఘనంగా సత్కరించగా న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్ ప్రతినిథులు ఆయన పనితీరును కొనియాడారు.

nv ramana, cji
ఎన్​వీ రమణ
author img

By

Published : Sep 5, 2021, 4:58 AM IST

Updated : Sep 5, 2021, 5:29 AM IST

'న్యాయవాదులు సమాజానికి దిక్సూచిగా నిలవాలి. అవసరమైన వారికి సాయం చేస్తూ ప్రజలకున్న హక్కుల పట్ల చైతన్యవంతుల్ని చేయాలి. న్యాయవాదులు వంతెనలు నిర్మించలేరు. టవర్లు కట్టలేరు. ఇంజిన్లు తయారు చేయలేరు. కానీ ఇబ్బందులను, ఒత్తిడిని తగ్గించగలుగుతారు. తప్పులను సరిదిద్దుతారు. ఇతరుల భారాలను స్వీకరించి, వారికి శాంతియుతమైన జీవితాన్ని ప్రసాదించగలుగుతారు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. సీజేఐ కావడంతోపాటు, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టిన సందర్భంగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) శనివారం ఆయన్ని సన్మానించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు- జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ సుందరేశ్‌లను గౌరవించింది. సీజేఐ మాట్లాడుతూ- న్యాయమూర్తుల నియామక ఖ్యాతి అంతా కొలీజియానికే దక్కుతుందన్నారు. 'నేను తెందుల్కర్‌ కాదు. ఒకవేళ తెందుల్కర్‌ ఉన్నా మొత్తం జట్టు ఆడితేనే మనం మ్యాచ్‌ గెలవగలుగుతాం' అనిపేర్కొన్నారు.

Justice NV Ramana was felicitated
జస్టిస్​ ఎన్వీ రమణకు సత్కారం

న్యాయవాదిగానే జీవితాన్ని ఎక్కువ ఆస్వాదించాను

'ఈ అభిమానం, గౌరవం నా బాధ్యతలను మరింత పెంచాయి. దీన్ని నా బాధ్యతలను గుర్తుచేసే కార్యక్రమంగా భావిస్తున్నాను. బార్‌ అసోసియేషన్‌, బార్‌ కౌన్సిళ్లంటే నాకు చాలా అభిమానం. న్యాయమూర్తిగా కంటే న్యాయవాదిగానే నేను జీవితాన్ని ఎక్కువ ఆస్వాదించాను. న్యాయవాదులు స్వతంత్ర వ్యక్తులు. న్యాయమూర్తి పదవి పూర్తి బాధ్యతాయుతమైనదన్న విషయంలో సందేహం లేదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఇప్పుడు అవకాశాలు తెరచుకుంటున్నాయి. అత్యధికమంది మహిళా న్యాయవాదులు ఈ వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళలకు మాత్రమే అత్యున్నత స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో మహిళలకు 11% ప్రాతినిధ్యం కల్పించగలిగాం.

కార్పొరేట్‌ ధరతో సామాన్యులు న్యాయసలహా పొందలేరు

విదేశాల తరహాలో మనవద్దా న్యాయవాద వృత్తి కార్పొరేటీకరణ జరుగుతోంది. జీవనోపాధి కోసం ఎంతోమంది ప్రతిభావంతులైన యువ న్యాయవాదులు న్యాయసంస్థల్లో ఉద్యోగులుగా చేరిపోతున్నారు. ఈ మార్పును స్వాగతించాల్సిందే. సంప్రదాయబద్ధమైన న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు తగ్గిపోతుండటం మాత్రం ఆందోళనకరం. కార్పొరేట్‌ ధరలు పెట్టి సామాన్యులు న్యాయసలహా పొందలేరు. ఎక్కువ ఖర్చు, సుదీర్ఘ సమయం తీసుకోవడం న్యాయ ప్రక్రియకు పెను సవాల్‌గా మారింది. మౌలిక వసతుల లేమి, పరిపాలనా సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటుండడం వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కొంటోంది. రోజంతా కోర్టుల్లో ఉంటూ న్యాయస్థాన ప్రాంగణాల్లో మరుగుదొడ్లు లేక మహిళా న్యాయవాదులు ఇబ్బందులు పడుతుంటారు. కక్షిదారులకు కోర్టుల్లో ఎలాంటి సౌకర్యాలూ లభించడంలేదు. నేను దేశం నలుమూలల నుంచి సమాచారం సేకరించి ఒక పెద్ద నివేదికను తయారుచేశాను. మరో వారం రోజుల్లో దాన్ని న్యాయశాఖ మంత్రికి సమర్పించబోతున్నాను. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ హైకోర్టుల జడ్జీల పదవులకు 82 పేర్లను సిఫార్సు చేశాం. హైకోర్టుల్లో ఉన్న 41% ఖాళీల భర్తీ చాలా పెద్ద పనే.

వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత లాయర్లదే

న్యాయవాదులు పుట్టుకతో నాయకులు. మార్గదర్శకులు. వారికి సామాజిక అంశాలతోపాటు, ఆర్థికం, చరిత్ర, రాజకీయాలు, సాహిత్యాలు తెలిసి ఉండాలి. సాధ్యమైనప్పుడల్లా ఉచిత సేవలు అందిస్తూ, హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. విలువలను విస్మరించకూడదు. దురుద్దేశపూరిత దాడుల నుంచి వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులదే. కొవిడ్‌ కారణంగా వచ్చిన సాంకేతిక మార్పులతో ఒక తరం ప్రతిభావంతులైన న్యాయవాదులు కనుమరుగవుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ యుగంలో కనెక్టివిటీ సమస్యగా మారింది. ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు ప్రాక్టీస్‌ చేసే పరిస్థితి లేదు. తాలూకా కేంద్రాల్లో మొబైల్‌ వ్యాన్లు ఏర్పాటుచేసి ఇంటర్‌నెట్‌ కల్పించేలా న్యాయశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి.

న్యాయశాఖ మంత్రిని విద్యార్థి అనుకున్నా

యువ న్యాయశాఖ మంత్రి (కిరణ్‌ రిజిజు) చాలా వేగంగా స్పందిస్తున్నారు. ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు కాలేజీ విద్యార్థేమో అనుకున్నాను. తాను న్యాయవిద్య చదివినా ఈ వృత్తిలో అనుభవం లేదని చెప్పారు. ఈ వ్యవస్థ గురించి ముందస్తు అభిప్రాయాలు ఏర్పడకుండా ఉండటానికి అదే మేలని చెప్పాను. న్యాయమూర్తుల ఖాళీల గురించి చెబితే... ఆయన చాలా నిబద్ధతతో తొమ్మిది పేర్లను ఆరు రోజుల్లో క్లియర్‌ చేశారు. అందుకు ప్రధాన మంత్రికి, న్యాయశాఖ మంత్రులకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఇదే వేగాన్ని ఇకముందు కూడా ప్రదర్శిస్తే మరో నెల రోజుల్లో 90% ఖాళీలను భర్తీ చేయగలుగుతాం' అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ వర్మను గుర్తు చేసుకున్నారు. 'జస్టిస్‌ జేఎస్‌ వర్మతో నాకు సాన్నిహిత్యం ఉంది. జూనియర్‌ న్యాయవాదిగా ఆయన వద్దకు వెళ్లేటప్పుడు కుమారుడిలా చూసుకొనేవారు. నిర్మొహమాటంగా ఉండాలనీ, దేనికీ జంకొద్దనీ చెప్పేవారు. నేను న్యాయమూర్తిని అవుతానని కూడా ఆరోజు అనుకోలేదు. నేను న్యాయమూర్తి అయిన తర్వాత.. ఒక న్యాయమూర్తికి పదోన్నతి కల్పిస్తే పదిమంది శత్రువులు తయారవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు' అని జస్టిస్‌ రమణ చెప్పారు.

సీజేఐకి ఏపీ, తెలంగాణ న్యాయవాదుల సన్మానం

కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ రమణను ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు, బార్‌ అసోసియేషన్‌ పదాధికారులు సన్మానించారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున ఛైర్మన్‌ ఘంటా రామారావు, వైస్‌ ఛైర్మన్‌ రామజోగేశ్వరరావు; ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తరఫున అధ్యక్షుడు వై.వి.రవిప్రసాద్‌, కార్యదర్శులు- పీటా రామన్‌, జె.యు.ఎం.వి.ప్రసాద్‌, కోశాధికారి తోట సునీత, కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీతులసి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు రామిరెడ్డి, రాష్ట్ర సభ్యుడు కృష్ణమోహన్‌లు సత్కరించారు. తెలంగాణ నుంచి బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు ముంతాజ్‌ పాషా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డిలు సన్మానించారు.

ఇదీ చూడండి: 'మా మూలాలు అక్కడి నుంచే మొదలయ్యాయి'

Last Updated : Sep 5, 2021, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.